Green signal for 53 new junior colleges in AP: ఏపీ విద్యార్థులకు అలర్ట్. ఏపీలో 53 నూతన జూనియర్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చంద్రబాబు కూటమి సర్కార్. ఈ మేరకు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా పంపిన ప్రతిపాదనలకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఆమోదం తెలిపారు. దీంతో ఏపీలో 53 నూతన జూనియర్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి.
37 మండలాల్లో 47, రెండు పట్టణ ప్రాంతాల్లో 6 కాలేజీలను ఏర్పాటు చేయనుంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జూనియర్ కాలేజీలు దాదాపు 480 ఉన్నాయి. ఏపీలో కొత్తగా 53 నూతన జూనియర్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఇక ఏపీలో 53 నూతన జూనియర్ కాలేజీలకు చంద్రబాబు కూటమి సర్కార్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరుణంలోనే.. ఏపీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కాలేజీల ఏర్పాటు వేగవంతం చేయనున్నారు.