తీవ్ర ఉత్కంఠకు తెర పడింది. ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలకు సమాధానం దొరికింది. చాలా మంది ప్రమాదం వద్దు అన్నప్పటికీ.. చివరకు లక్షల మంది కోరిక నెరవేరింది. ఈ కరోనా సమయంలో తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది ఎదురు చూస్తున్న ఆనందయ్య కరోనా మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే కొన్ని షరతులు విధించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కృష్ణపట్నం ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందుపై ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు మొగ్గు చూపింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ CCRAS కమిటీ తన నివేదికను ఈ రోజు వెల్లడించింది.
దీని ప్రకారమే ఏపీ ప్రభుత్వం కరోనా మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కంట్లో వేస్తున్న మందుకు తప్ప ఆనందయ్య ఇస్తున్న మిగతా మందులకు ప్రభుత్వం ఒప్పుకుంది. కంట్లో వేసే చుక్కలకు సంబంధించి పూర్తి నివేదిక రావాల్సి ఉందని ప్రభుత్వం, అధికారులు స్పష్టం చేశారు. కె అనే కంట్లో వేసే మందును కమిటీ ముందు ప్రదర్శించనందున సీసీఆర్‌ఏఎస్ అధికారులు దానికి నిరాకరించారు. అయితే మిగతా పి.ఎల్.ఎఫ్ మందులకు పర్మిషన్ వచ్చింది.