తెలంగాణలో 31.6 శాతం గ్రీనరీ పెరిగింది – హరీష్ రావు

-

పీవీ మార్గ్ లోని పీపుల్స్ ప్లాజాలో 12వ గ్రాండ్ నర్సరీ మేళాను ప్రారంభించారు ఆర్ధిక, వైద్యారోగ్యా శాఖ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ్టి నుండి ఈనెల 22 వరకు గ్రాండ్ నర్సరీ మేళా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. వివిధ రాష్ట్రాల నుండి 120 పైగా స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. స్టాల్స్ లో 100 పైగా అరుదైన మొక్కలు,విత్తనాలు,ఎరువులు, పరికరాలు ప్రదర్శన, విక్రయాలు జరుగుతాయన్నారు. పూలు, పండ్లు, గార్డెనింగ్ లాంటి మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు.

harishrao

పీపుల్స్ ప్లాజాలో ఈ నర్సరీ ఉందని.. అన్ని ఒకే చోట దొరుకుతాయన్నారు మంత్రి హరీష్ రావు. అందరూ వారి వారి ఇళ్ల దగ్గర గార్డెన్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామాల్లో హరితహారంతో మొక్కలు పెంచటం లాంటి కార్యక్రమం చేపడుతున్నామన్నారు. పల్లె ప్రకృతి వనాలు పెద్ద ఎత్తున ప్రారంభం అయ్యాయన్నారు. చెట్ల పెంపకం ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ శ్రీకారం చుట్టిందన్నారు మంత్రి.

గతంలో ఒక మొక్క పెట్టి ఫోటో దిగి వెళ్లేవారు కానీ ఈ తెలంగాణ వచ్చాక 85 శాతం మొక్కలు బ్రతికేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణలో 31.6 శాతం గ్రీనరీ పెరిగింది అన్నారు. అడవులని బ్రతికించటం, ముళ్ల చెట్లు పెట్టి, అడవులని పునరజ్జివనం చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version