కల్లోల కాంగ్రెస్..ముంచేస్తున్నారుగా!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి రోజురోజుకూ దిగజారుతుందే తప్ప…బలపడుతున్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికే వరుసగా రెండు సార్లు ఓడిపోయి అధికారానికి దూరమైంది…అలాంటప్పుడు బాగా కష్టపడి మూడోసారైనా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నేతలు కష్టపడాలి. కానీ అలా చేయకపోగా, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ…మీది తప్పు అంటే మీది తప్పు అని మాట్లాడుకుంటూ పార్టీకి ఇంకా నష్టం చేకూరుస్తున్నారు.

ఇప్పటికే పార్టీ చాలావరకు నష్టపోయింది…కాంగ్రెస్ నేతలు చాలామంది టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు. అయినా సరే ఇప్పటికీ పార్టీ బలంగా ఉండటానికి కారణం…బలమైన కార్యకర్తలు ఉండటం. అందుకే పార్టీ నిలబడింది. అలాంటప్పుడు నేతలు ఇంకా దూకుడుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలి…కానీ నేతలు మాత్రం అలా చేయడం లేదు…ఎవరికి వారు తమకు ప్రాధాన్యత లేదని, రేవంత్ రెడ్డి వల్ల పార్టీ నాశనం అవుతుందని చెప్పి బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.

సరే రేవంత్ రెడ్డి ఏ పార్టీలో నుంచి వచ్చారనే విషయం పక్కన పెడితే…టి‌పి‌సి‌సి అధ్యక్షుడుగా రేవంత్ సమర్ధుడా? కాదా? అనేది మాత్రం చూసుకోవాలి. అలా కాకుండా రేవంత్ టీడీపీ నుంచి వచ్చాడు…కాంగ్రెస్ పార్టీని టీడీపీ మాదిరిగా మార్చేస్తున్నారని విమర్శలు చేయడం వల్ల ఉపయోగం లేదు. మరి రేవంత్ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో చెప్పలేం గాని…అసంతృప్తి పేరుతో బహిరంగంగా సొంత పార్టీపై విమర్శలు చేసే నేతల వల్ల బాగానే నష్టం జరుగుతుంది.

ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ పార్టీని వదిలారు. ఇక పార్టీలో ఉంటూనే పార్టీకి నష్టం చేకూరేలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డిల తీరు ఉందని విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డిలు సైతం రివర్స్ లో మాట్లాడటం మొదలుపెట్టారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా తదనంతర పరిణాలతో పలువురు సీనియర్లు పార్టీకి దూరమయ్యారని, కాంగ్రెస్ లో కల్లోలానికి రేవంత్‌రెడ్డి పూర్తి బాధ్యుడని మర్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నారన్నారు. ఇక్కడ రేవంత్ ఎంత నష్టం చేస్తున్నారో తెలియదు గాని…అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలని సైతం బయటపెట్టి ఇలాంటి అసంతృప్తి నేతలు పార్టీలో కల్లోలం సృష్టిస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు అనుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version