పర్యావరణ పరిరక్షణపై సమాజంలోని అందరికీ బాధ్యత ఉండాల్సిందే. అది కాదనలేని సత్యం. అయితే ఆ విషయాన్ని సాధారణంగా ఎవరైనా చెప్పవచ్చు. అందుకు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి, యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు.
జనాలను వెర్రి బకరాలను చేయడంలో కొందరు ఎల్లప్పుడూ సిద్ధహస్తులుగానే ఉంటారు. వారిలో కొందరు పైకి గాంభీర్యంగా, బ్రహ్మాండం బద్దలు కొట్టే వ్యక్తుల్లా కనిపిస్తారు. కానీ వారికి చెటాకంత మెదడు కూడా ఉండదని మనకు తరువాత తెలుస్తుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది.. మేం ఎవరి గురించి చెబుతున్నామో.. అవును.. ఆ బాలికే.. గ్రెటా థన్‌బర్గ్.. మొన్నీ మధ్యే పర్యావరణ పరిరక్షణపై స్పీచ్ ఇచ్చి సో కాల్డ్ మేథావుల దృష్టిలో ఆమె సూపర్ గర్ల్ అయింది కదా.. ఆమె గురించే మేం చెప్పేది..!
Script vs No Script ft. Greta Thunberg ? pic.twitter.com/n8hVFfDeRW
— BALA (@erbmjha) September 26, 2019
పైన ఇచ్చిన వీడియో చూశారా..? అందులో ఉన్నది గ్రెటానే.. పర్యావరణ పరిరక్షణపై ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేక నీళ్లు నమిలింది. ఆ తరువాత ప్రశ్న అర్థం కాలేదని మరోసారి చెప్పగా.. అతను మళ్లీ తన ప్రశ్న రిపీట్ చేశాడు. అయినా ఆమెకు అతను అడుగుతున్నది అర్థం కాక.. ఇతరులను కూడా ప్రశ్నలు అడగాలి కదా.. అంటూ తప్పించుకుంది. మొన్న పర్యావరణ పరిరక్షణపై హౌ డేర్ యు అంటూ స్పీచ్ ఇచ్చిన ఆ బాలికే.. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక తెల్లముఖం వేసింది. దీంతో ఆవిడ గారి ప్రతిభకు అందరూ ఇప్పుడు షాకవుతున్నారు.
ఆ బాలిక హౌ డేర్ యు.. అంటూ.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివిందని మనకు అప్పుడే అర్థమైంది. ఆ విషయం మనకు పైన వీడియోలో కూడా తెలుస్తుంది. అప్పుడు ఆమె యాక్టింగ్ చేసిందని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ కొందరు సో కాల్డ్ మేథావులు మాత్రం ఆ బాలికను ఆకాశానికెత్తారు. ఈమె మరో మలాలా.. నోబుల్ ప్రైజ్ ఇవ్వాలంటూ.. పొగడ్తల వర్షం కురిపించారు. కానీ ఆ బాలికతో కావాలనే అలా చేయించారని తెలిశాక.. నెటిజన్లు ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. ఈ క్రమంలోనే ఆ బాలికను అందరూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఏమీ తెలియని ఓ బాలికతో అలా హౌ డేర్ యు అంటూ.. స్క్రిప్ట్ చదివించి.. చక్కని యాక్టింగ్ చేయించారని విమర్శిస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణపై సమాజంలోని అందరికీ బాధ్యత ఉండాల్సిందే. అది కాదనలేని సత్యం. మానవుడు చేస్తున్న అనేక తప్పిదాల వల్ల పర్యావరణంపై తీవ్రంగా ప్రభావం పడుతోంది. అయితే ఆ విషయాన్ని సాధారణంగా ఎవరైనా చెప్పవచ్చు. అందుకు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి, యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిందే. కానీ ఇలా యాక్టింగ్ చేస్తూ.. ప్రజలను వెర్రి బకరాలను చేయడం అస్సలు మంచిది కాదు. నిజంగా పర్యావరణంపై అంత స్పృహ ఉంటే.. దాన్ని మాటల్లో కాదు.. ఎవరైనా సరే.. చేతల్లో చూపించాలి. అలా చేయకుండా.. బిగ్గరగా అరుస్తూ.. డైలాగులు చెబితే.. దాన్ని ఎవరూ హర్షించరు. అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు..!