BIG BREAKING: ఆన్లైన్ గేమ్స్ , క్యాసినో లపై GST ని 28% పెంచేసిన నిర్మలా సీతారామన్ … !

-

ఈ రోజు ఢిల్లీ వేదికగా జరిగిన 51వ GST కౌన్సిల్ మీటింగ్ లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు భారత ఆర్ధిక శాఖ. తెలుస్తున్న సమాచారం ప్రకారం కొన్ని అంశాలకు సంబంధించి GST ను భారీగా పెంచడం జరిగింది. GST పెంచిన అంశాలలో ఆన్లైన్ గేమింగ్, క్యాసినో గేమ్స్, హార్స్ రేసింగ్ లు ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా భారత ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ GST అమలు అక్టోబర్ 1వ తేదీ నుండి రానుంది. నేటి రోజుల్లో దాదాపుగా యువత అంతా ఈజీ మనీ పైన ఆదారపడి ఉంది. ఎటువంటి పని కూడా చేయకుండానే ఆన్లైన్ లో అందుబాటులో ఉన్న చాలా గేమ్స్ ను ఆడుతూ క్యాష్ ను ఎర్న్ చేస్తున్నారు. కొందరు అయితే ఆన్లైన్ గేమ్స్ ను ఆడడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. కానీ ఈ వార్త మాత్రం అలాంటి వారందరికి విచారాన్ని కలిగించే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా క్యాసినో మరియు హార్స్ రేసింగ్ లకు కూడా ఇదే వర్తిస్తుంది.

కాగా కేంద్ర ప్రభుత్వం ఈ 28 శాతం GST అమలు ఏ విధంగా ఉందన్న విషయం గురించి ఆరు నెలల తర్వాత రివ్యూ మీటింగ్ పెట్టుకుంటామని నిర్మల సీతారామన్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news