నేడు గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు

-

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటలకల్లా ఓటింగ్ సరళి తెలిసిపోనుంది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. రెండు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ మళ్లీ అధికారం నిలబెట్టుకొంటుందా? పంజాబ్‌లో సత్తా చాటి ఊపుమీదున్న ఆప్‌ సంచలనం సృష్టిస్తుందా? కాంగ్రెస్‌ పునర్వైభవం సొంతం చేసుకుంటుందా? అన్నది మరికొన్ని గంటల్లో తేలనున్నది. హిమాచల్‌ప్రదేశ్‌లో నవంబర్‌ 12న, గుజరాత్‌లో డిసెంబర్‌ 1, 5 తేదీల్లో నిర్వహించిన పోలింగ్‌ ఫలితాల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది.

గుజరాత్‌లో మళ్లీ బీజేపీయే అధికారం చేపడుతుందని, హిమాచల్‌ప్రదేశ్‌లో మాత్రం బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నదని అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు అంచనావేశాయి. గుజరాత్‌ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉన్నాయి. అధికారం చేపట్టాలంటే 92 స్థానాల్లో గెలవాల్సిందే. రెండు విడుతల్లో జరిగిన ఎన్నికల్లో 64.33 శాతం పోలింగ్‌ నమోదయింది. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో 68 స్థానాలు ఉన్నాయి. మెజార్టీ మార్కుకు 34 స్థానాల్లో విజయం సాధించాలి. కాగా, 1985 నుంచి వరుసగా రెండుసార్లు ఏ పార్టీకి పట్టంకట్టని హిమాచల్‌ ప్రజలు ఈ సారి ఆ ఆనవాయితీని కొనసాగిస్తారా అనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version