జీతాలు పెరగకున్నా పర్సు నిండింది..!

-

ప్రస్తుతం రూపాయి విలువ అంతకంతకూ పడిపోతుండటం తెలిసిందే. దీంతో విదేశాల్లో పనిచేసేవాళ్లు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో పనిచేసే ఎన్ఆర్ఐల జీతాలు పెరగకున్నా… పర్సు మాత్రం నిండిపోతోంది. ఎందుకంటే ప్రస్తుతం డాలర్ విలువ 71.79 రూపాయలకు పడిపోయింది. ఇదివరకు ఎప్పుడూ రూపాయి విలువ ఇంతలా పడిపోయింది లేదు.

దీంతో ఎన్ఆర్ఐలు తమ డబ్బును ఎక్స్ చేంజ్ లో మార్చుకుంటే ఎక్కువ మొత్తంలో రూపాయలు వస్తున్నాయి. ఇదివరకు పంపించిందానికంటే ఎక్కువ డబ్బు తమ వాళ్లకు వెళ్తుండటంతో వాళ్లు కాసింత సంతోషంగానే ఉన్నారు. ఇక.. రూపాయి విలువ పడిపోవడం.. డాలర్ విలువ పెరిగిపోతుండటంతో తమ డబ్బును ఇంటికి పంపించేందుకు ఎన్ఆర్ఐలంతా క్యూ కడుతున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో మనీ ఎక్స్ చేంజ్ కంపెనీలు కిటకిటలాడుతున్నాయట. పోనీ.. శాలరీ పెరగకున్నా రూపాయి విలువ పడిపోయి మమ్మల్ని ఆదుకుంటుంది అని సంతోషపడుతున్నారు ఎన్ఆర్ఐలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version