Guntur Kaaram : మహేష్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్…..

-

త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్నా నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ విడుదల తేదీని కూడా ఇదివరకే ప్రకటించారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 6న హైదరాబాదులో నిర్వహిస్తామని ప్రకటించిన మేకర్స్ , పోలీసుల అనుమతి లభించకపోవడంతో ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను క్యాన్సిల్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని వేదికను ప్రకటిస్తామని చెప్పారు. దీంతో ప్రిన్స్ అభిమానులు నిరాశకు లోనవుతున్నారు.

ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకతో మహేష్ బాబు ట్రెండ్ సెట్ చేయనున్నారు. గుంటూరు కారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలోని థియేటర్లలో లైవ్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version