గుప్పెడంతమనసు ఎపిసోడ్ 240: స్లంఏరియా విజిట్స్ లో నడవలేక అలిసిపోయిన రిషీ..బైక్ ఏర్పాటు చేసిన వసుధార..!

-

గుప్పెడంతమనసు ( Guppedantha Manasu ) ఈరోజు ఎపిసోడ్ లో వసూ వెనక రిషీ నానా కష్టాలు పడుతూ నడుస్తూ ఉంటాడు. షూకి బురద అంటుకోవటంతో ఆగిపోతాడు. అది గమనించిన వసూ.. ఏంటీ సార్ ఆగారు , ఏమైంది సర్ అని అడుగుతుంది. ఇలాంటి ప్లేస్ లో నడవటం నాకు ఇబ్బందిగా ఉంది. నువ్వెలా నడుస్తున్నావ్ అంటాడు. సార్ చిన్నప్పుడు ఇలాంటి పల్లెటూర్లో నడిచేదాన్ని, నాకు నడకఇష్టం, సైకిల్ తొక్కేదాన్ని అంటూ చెప్తుంది. రండి మీరు కూడా అలవాటవుతుంది. అని చెయ్యిస్తుంది. రిషీ పర్లేదు నేనే నడుస్తా అంటూ నడుస్తాడు. ఒక దగ్గర జారి కిందపడబోతాడు. వెంటనే వసూ చేయి అందించి కిందపడకుండా పట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ లో సాంగ్ వేసుకుంటారు.
Guppedantha Manasu | గుప్పెడంతమనసు
Guppedantha Manasu | గుప్పెడంతమనసు
కొంచెం సేపు అలానే ఉంటారు. రిషి థ్యాంక్స్ చెప్తాడు. వసూ గతంలో శారికట్టుకున్నప్పుడు రిషీ పట్టుకుంది గుర్తుచేసుకుని చెల్లుకిచెల్లు అంటుంది. రిషీకి ఏం అర్థంకాదు. ముందుముందు మీకే అర్థమవుతుంది అంటుంది. రిషీ ఇంక ఎంతదూరం నడవాలి అంటాడు. అదేంటి సార్ నడక ఇష్టం, జాగింగ్ చేస్తా అన్నారు. అక్కడైతే జాగింగ్ ట్రాక్ ఉంటుంది. ఇలాంటి ప్లేస్ ఎందుకు సెలెక్ట్ చేశావ్..కావాలనే చేశావ్ కదా అని రిషీ అంటాడు. సార్ ఇది మేము వెళ్లటానికి సెలెక్టే చేశాం..మీరు వస్తారని తెలియదుకదా.. పర్లేదు సర్ అప్పుడప్పుడు ఇలాంటి ప్రదేశాలకు రావాలి, జీవితంలో అన్నీ చూడాలి, అన్నిరకాల దశలు చూడాలి, అన్ని రకాల వ్యక్తులను కలవాలి, అన్ని రకాల కష్టనష్టాలు చూడాలి అప్పుడు జీవితం కలర్ ఫుల్ గాఉంటుంది. నీ కొటేషన్స్ వినే ఓపిక నాకు లేదు ఇంక ఎంతదూరం అంటాడు. వసూ రెండు కిలోమీటర్లు అంటుంది. రిషీ దెబ్బకి షాక్ అవుతాడు నావల్ల కాదు అంటాడు. ఏదైనా ఏర్పాటు చేయ్ అంటాడు. వసూ సైకిల్ అంటుంది.. గతంలో వసూని సైకిల్ ఎక్కించుకెళ్లిన సీన్ గుర్తుచేసుకని రిషీ నో అంటాడు.
వసూ బైక్ ఏర్పాటు చేస్తుంది. ఇద్దరు బైక్ పై ప్రయాణం సాగిస్తారు. అడ్డగ్గానే బైక్ బానే సంపాదించావే అంటాడు రిషీ .. ఇక్కడే ఉండే వాలంటీర్ సర్ లక్కీగా దొరికింది అంటుంది. బైక్ దొరకటం లక్కీనే.. కిందపడితేనే ప్రాబ్లమ్ అని గట్టిగా పట్టుకోమంటాడు. వసూ లైట్ గా చెయ్ వేస్తుంది. పట్టుకోవటం ఇష్టం లేకపోతే కిందపడితే కట్టుకట్టించుకోవాలి గట్టిగా పట్టుకోమంటాడు రిషీ. వసూ… సర్ మీకు అన్ని బైక్ లు నడపటం వచ్చా అని అడుగుతుంది. నీకు నా డ్రైవింగ్ మీద నమ్మకం లేనట్లు ఉంది. గాల్లో ఎగిరేవి తప్ప అన్ని నడుపుతా అంటాడు రిషీ. బస్సు, లారీ, ట్రాలీ అని చెప్పబోతుంటాడు. వసూ సర్ సర్ మరోలా అనుకోకండి భయం నాది కదా సర్ అంటుంది. ఇక్కడ రోడ్డుని బట్టి నా డ్రైవింగ్ ఉంటుంది. టెన్షన్ తగ్గించుకుని ఈ వాతావరణం, ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయ్ అంటాడు రిషీ. వసూ సరే అని చెప్పి.. రిషీ సార్ తో బైక్ పై వెళ్లటం కొత్తగా ఉంది. ఎక్కడ మొదలైన నా ప్రయాణం ఎక్కడ వరకూ వచ్చింది .అంటూ మొదట నుంచి రిషీతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటుంది. అప్పుడే అరుస్తారు, అప్పుడే కామ్ అవుతారు అనుకుంటూ మీరు జంటిల్ మెన్ సర్ అనుకుంటుది.
బైక్ పై రిషీ వెళ్తూ ఉండగా వసూకి నిద్రొచ్చి మీద వాలిపోతుంది. రిషీకి ఒక దగ్గర వెళ్లాక రూట్ అర్థంకాక..వసూని పిలుస్తాడు. ఎక్కడిదాక వచ్చాం అంటాడు. వసూ లేచి అప్పుడే వచ్చామా అని అడుగుతుంది. అది నువ్వే చెప్పాలి, పిలిస్తే పలకవేంటి నిద్రపోతున్నావా అని అడుగాతాడు రిషీ. లేదు సర్ కళ్లుమూతలు పడ్డాయ్ అంటుంది వసూ. దాన్నే అందరు నిద్ర అంటారు అని రీషి అంటాడు. వసూ అటూ ఇటూ చూసి ఇంకొంచెం ముందుకెళ్లాలి సర్ అంటుంది. రిషీ బైక్ స్టాట్ చేస్తాడు. ఒక చెట్టు దగ్గర వసూ ఇదే సర్ ఆపండి అంటుంది. బైక్ లాక్ చేయండి సర్ వచ్చేశాం అంటుంది. ఇంకెంతదూరం అని రిషీ అడుగుతాడు. ఇక్కడే సర్ రెండు అడుగులేస్తే వచ్చేస్తుంది. ఇక్కడే ఇక్కడే అంటూ ఇంతదూరం తీసుకొచ్చాం అంటాడు రిషీ. ఇక్కడే సర్ వచ్చినట్లే అని వసూ అంటుంది. బైక్ దిగి రిషీ వసూ నడుస్తూ ఉంటారు.
ఇంకోపక్క మహేంద్ర జగతి మాట్లాడుకుంటూ ఉంటారు. ధరణి విషయంలో నిన్న జరిగింది తలుచుకుంటారు. అక్కయ్యగారికి అదేం ఆనందమే తెలియటం లేదు. ఎదుటివారు సంతోషంగా ఉంటే ఓర్వేలేదు. క్రమంగా ధరణి కూడా సంతోషాన్ని కోల్పోతుంది. మహేంద్ర చూస్తున్నా అంటాడు. జగతి ..నువ్వు చూస్తూనే ఉంటాం. నా విషయంలో కూడా నువ్వు చూస్తూనే ఉన్నావ్. నాకు జరిగిందే ధరణీకి జరుగుతుంది అంటుంది జగతి. వదినను ఎదిరించి మాట్లాడాలి అన్నా.. తనను ఒప్పించాలన్న, ధరణి సంతోషంగా ఉండాలన్న రిషీ వల్లే అవుతుంది జగతి అని మహేంద్ర అంటాడు. రిషీ కల్లకు అబద్దపు గంతలు కట్టి అక్కయ్య ఆడిస్తుంది అని జగతి అంటుంది. రిషీ మనం చెప్తే వినడు, తనంతట తానే తెలుకుంటాడు. ఆరోజు వదినగారి ఆట కట్టిస్తాడు అని మహేంద్ర అంటాడు. ఆ మాటకు జగతి నవ్వుతుంది. ఎందుకు జగతి నవ్వుతున్నావ్ అని మహేంద్ర అడిగితే… నవ్వకుండా ఏం చేయగలను మహేంద్ర నా ఆనందం కోసం చెప్తున్నావ్, అవన్నీ జరిగేవి కావు మహేంద్ర అంటుంది. మహేంద్ర జరగాలని కోరుకోవాలి అంటాడు.
నా పర్మిషన్ లేకుండా స్లమ్ ఏరియా విజిట్స్ కు వెళ్తానంటే వద్దన్నాని రిషీకి కోపం వచ్చినట్లు ఉంది అని జగతి అంటుంది. మహేంద్ర..రిషీకినువ్వు అడ్డుచెప్పవ్ కదా అని అడుగుతాడు..నేను నా కొడుక్కి అడ్డుచెప్పలేదు, డీబీఎస్ డీ కాలేజ్ ఎండీకి అడ్డుచెప్పాను అంటుంది జగతి. నువ్వు గ్రేట్ అని మహేంద్ర అంటాడు. పద్దతి పద్దతే కదా మహేంద్ర అని జగతి అంటుంది. మీ తల్లికొడుకులు ఇద్దరు ఇద్దరే అని పక్కన ఉన్న ఆల్బమ్ తీసి..ముందురోజు వసూ చేతిలోంచి ఆల్బమ్ జారిన సీన్ గుర్తుచేసుకుంటాడు. చే జారింది ఆల్బమ్ మాత్రమేనా వసుధార అనుకుంటాడు.
ఇటుపక్క వసూ రిషీలు నడుస్తూ.. సర్ అలిసిపోయారా అని అడుగుతుంది. లేదు నేనేమేం అలిసిపోను అంటాడు. అవును సర్ అని వసూ అంటుంది. మరి ఎందుకు అడిగావ్ అని రిషీ అడుగుతాడు..నా అంచనా తప్పేమో అని వసూ అంటుంది. నన్ను అంచనా వేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటావా అని రిషీ అడుగుతాడు. అలా ఏం లేదు సర్..నన్ను నేను పరిక్షించుకుంటాను, నేను చేస్తున్నది, నేను ఊహిస్తున్నది కరెక్టేనా అని ..అలా చేస్తూ ఉంటే మన బ్రేయిన్ షార్ప్ అవుతుంది అని వసూ అంటుంది. ఇలాంటి విద్యలు చాలానే ఉన్నాయ్ నీ దగ్గర అని రిషీ అంటే..అలా ఏం లేదు సర్ కొన్నే ఉన్నాయ్ అని వసూ అంటుంది. ఇద్దరు మళ్లీ నడక ప్రారంభిస్తారు. కొంచెం దూరం అయ్యాక వాలంటీర్ సతీష్ కనిపిస్తాడు. వసూ అతన్ని రిషీకి పరిచయం చేస్తుంది. ఇద్దరిని వాలంటీర్ కమ్యునిటీహాల్ లోకి తీసుకెళ్తాడు.
అక్కడ ఉన్న వాలంటీర్స్ గురించి సతీష్ రిషీ వసూలకు చెప్తాడు. వాళ్లకి కూడా రిషీ గురించి చెప్తారు. మనం మంచిగా చూసుకుందాం, మర్యాద చేద్దాం అంటాడు. వాళ్లకు కుర్చీలు తెస్తారు. రిషీ కుర్చోబోయే కుర్చీమీద దుమ్ము ఉందని వసూ తన చున్నీతో తుడుస్తుంది. ఏం చేస్తున్నావ్ వసుధార నీ డ్రెస్ కి మురికవుతుంది అని రిషీ అంటాడు. పర్లేదు సర్ ఉతికితే పోతుంది..అందరి ముందు మీరు ఈ దుమ్ములో కుర్చోకూడదని చెప్పి తుడుస్తుంది. రిషీ అలానే చూస్తాడు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version