సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై ట్విస్ట్.. తెరపైకి రైడింగ్ అంశం !

-

టాలీవుడ్ యంగ్ హీరో, మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ నిన్నరోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. అయితే హీరో సాయి ధరమ్ యాక్సిడెంట్ కేసు లో పోలీసుల కు కొన్ని అనుమానాలు వస్తున్నాయి. సాయి ధరమ్ తేజ.. రైడింగ్ కు పాల్పడ్డరా అనే అంశం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఘటన జరిగిన చోట సిసి కెమెరాలను పరిశీలించారు పోలీసులు.

ఈ నేపథ్యం లోనే సాయి ధరమ్ తేజ , నవీన్ , మరో వ్యక్తి కలిసి ఒకే చోట నుంచి బయలు దేరినట్టు అనుమానాలు వ్యక్తం  చేస్తున్నారు పోలీసులు. ఒకే డెస్టి నేషన్ పెట్టుకుని ఎవరు ముందు.. వెళ్తారనే దానిపై రైడింగ్ జరిగినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అయితే నరేష్ కొడుకు నవీన్ కూడా ఈ బైక్ రైడింగ్ లో పాల్గొన్నట్లు గా గుర్తించారు పోలీసులు. ఈ నేపథ్యం లోనే రైడింగ్, రేసింగ్ కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిర్లక్ష్యం మరియు రాష్ డ్రైవింగ్ కింద… ఐపీసీ 3, 36,184 ఎంవీ యాక్టు ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version