గుప్పెడంతమనసు 317 ఎపిసోడ్: రెస్టారెంట్ లో జగతి, వసూలతో పంచాయితీకి సిద్ధమైన దేవయాని..ఎంట్రీ ఇచ్చిన రిషీ

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ వసూ మెసేజ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకేంటి విశేషాలు అని వసూ మెసేజ్ చేస్తుంది. మన ఇగో మాష్టర్ దానికి గుడ్ మార్నింగ్ వసుధార అని రిప్లైయ్ ఇస్తాడు. ఏమన్నా అంటే..గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ చెప్తాడు అనుకుంటుంది.. రిషీ నేను వసుధారకు ఏం చెప్పాలనుకున్నాను.. అనుకోవడానికి చాలానే అనుకుంటాంలే.. చాలా తిరిగాం..అంత వనభోజనాల మహిమా అనుకుంటాడు. ఇక్కడ వసూ కూడా రిషీ సార్ ఏంటో అప్పుడే బాగుంటారు.. అంతలోనే మూడ్ మూరిపోతుంది అనుకుని.. రిషీతో కలిసి దిగిగన ఫొటోలు చూసి రిషీకి కూడా పంపుతుంది.

తెల్లారుతుంది. రిషీ ఆ ఫొటోలు చూస్తూ పడుకున్నాడేమో.. ఫోన్ లో అదే ఫొటో ఉంటుంది. కాకపోతే.నిద్రలో ఫోన్ మీద చెయి వేయటంతో వసూ ఫేస్ కవర్ అవుతుంది. దేవయాని వచ్చి..ఆ ఫోన్ తీయబోతుంది. అప్పుడే మహేంద్ర కాపీ తీసుకోండి మీకే తెచ్చాను అంటాడు. అయినా దేవయాని ఆ ఫోన్ లో ఎవరిదై ఉంటుంది అని ఫోన్ తీయబోతుంది. మహేంద్ర.. కావాలనే.. గట్టిగా గుడ్ మార్నింగ్ రిషీ అంటాడు. రిషీ లేస్తాడు. బెడ్ షీట్ ఫోన్ పై పడటంతో.. ఆ ఫొటో చూసే భాగ్యం దేవయానికి దక్కదు. దేవయానికి ఇక..నాన్న రిషీ రాత్రి ఎన్నిగంటలకు వచ్చావు, ఇలా లేటుగా పడుకుంటే ఆరోగ్యం పాడవుతుంది కదా అంటుంది. ఇంతలో మహేంద్ర.. అవును రిషీ నీ కోసం రాత్రి చాలా సేపు ఎదురుచూశారు, నన్ను కూడా ఎదురుచూడటం లేదని అన్నారు రషీ అంటాడు. అలా మహేంద్ర దేవయాని మీద చురకలు అంటించి..అందరికి కాఫీ ఇస్తాడు. ఏంటి వదినా థ్యాంక్స్ చెప్పారా అని మహేంద్ర అడుగుతాడు.. నువ్వు నాకు చాలనే చేశావు..అన్ని కలిపి ఒకేసారి చెప్తా అంంటుంది దేవయాని.

కట్ చేస్తే.. మహేంద్ర ఎక్సర్ సైజ్ చేస్తూ..రిషీ కోసం వెయిట్ చేస్తుంటాడు. రిషీ హడావిడిగా వచ్చి కారు తీయబోతాడు. ఎక్కడకు రిషీ అంటే.. నన్ను ఒకరు రమ్మన్నారు డాడ్ వెళ్తున్నాను అంటాడు రిషీ. నేను వస్తాను అని మహేంద్ర అంటాడు. రిషీ మన పార్క్ లో జాగింగ్ క్లబ్ వాళ్లు మీటింగ్ ఉందట రమ్మన్నారు అని రిషీ అంటే.. అయితే నేను వస్తా అని పట్టుబడతాడు కానీ రిషీ ఎలాగోలా మహేంద్రను తప్పించుకుని వచ్చేస్తాడు. మహేంద్ర మైడియర్ పుత్రా నువ్వు అబద్ధం చెప్తున్నావ్ అని నాకు తెలుసు రా..ఎదిగిన కొడుకు అబద్ధం చెప్తున్నాడంటే.. పక్కదారిపడుతున్నాడనా, ప్రేమలో పడుతున్నాడనా.. మొదటిది ఎటూ వీడు చేయడు.. రెండోదే కాయం చేసుకుందాం అనుకుంటాడు.

మరోపక్క వసూ ఇంట్లో ఫ్లవర్ కి వాటర్ స్ప్రే చేస్తూ ఉంటుంది. రిషీ వచ్చి కార్ హారన్ కొడుతూ ఉంటాడు. అది వసూ, జగతి ఇద్దరూ వింటారు. వసూ రిషీ సార్ అని సంతోషంగా ఆ చేతిలో ఉన్న పూలతో సహా పరుగెత్తుకుంటూ వెళ్తుంది. గుడ్ మార్నింగ్ సార్ అని వసూ అంటే..మార్నింగ్ ఏంటి కొత్తగా ఫ్లవర్స్ తో స్వాగతం పలుకుతున్నాం అంటాడు రిషీ. ఫ్లవర్ వాజ్ లో ఫ్లవర్ మారుస్తుండగా మీరు వచ్చారు..ఉన్నపళంగా మీరు వచ్చేశారని వచ్చేశా అంటే మీరు నమ్మరు అని తీసుకోండి సార్ అంటుంది. ఇదంతా డోర్ దగ్గర నుంచి జగతి చూస్తునే ఉంటుంది. రిషీ నో థ్యాంక్స్ అంటాడు. రండి సార్ లోపలికి అని వసూ అంటే..ఎందుకు వచ్చానో అడగవా అని రిషీ అంటే.. అలా ఎలా అడుగుతాను సార్ అని వసూ అంటుంది. మిషన్ ఎడ్యుకేషన్ గురించి నాకొక ఐడియా వచ్చింది అంటాడు రిషీ. జగతి వసూని పిలిచి ఇంటికి వచ్చిన వాళ్లను రోడ్డుమీదే నిలబెట్టి మాట్లాడతావా..లోపలికి పిలువు..పైగా ఇది కాఫీ తాగే టైం కదా అంటుంది. రిషీ నేను కాఫీ తాగే వచ్చాను వసుధార అంటాడు. కాఫీ తాగకున్నా కుర్చోని మాట్లాడదాం..ఏదో ఐడియా వచ్చింది అన్నారు అంటుంది. రిషీ సరే అంటాడు. కొడుకు లోపలికి వస్తుంజటంతో జగతికి అబ్బో ఆనందం మాములుగా ఉండదు. ఏంటో..జగతి, వసూ, రిషీ మాట్లాడుకుంటారు. ప్రాజెక్ట్ కు సంబంధించి షార్ట్ ఫిల్మ్ తీయటం చాలా బాగుంది అంటుంది వసూ. కాసేపు ఉండి.. రిషీ వెళ్లిపోతాడు.

జగతి, వసూ కాలేజ్ కు వెళ్లడానికి బయటకు వస్తారు. అప్పుడే దేవయాని ఎంట్రీ ఇస్తుంది. రావడం రావడంతోనే…అసలు ఏం అనుకుంటున్నారు అంటుంది. ఏమైంది అక్కయ్య అని జగతి అడుగుతుంది. ఏమైందా..ఏం వసుధార వనభోజనాలు అయ్యాక అందరూ ఇంటికి వస్తే..నువ్వు రిషీ ఎక్కడకు వెళ్లారు..అర్థరాత్రుళ్లు ఎటు తిరిగుతున్నారు అంటుంది. ఇదే ప్రశ్న రిషీ సార్ ని అడగలేకపోయారా మేడమ్ , నన్ను ఎందుకు అడుగుతున్నారు అంటుంది వసూ. దేవయాని ఏం జగతి నీ శిష్యురాలికి బాగా ట్రైనింగ్ ఇస్తున్నావే అంటుంది. ట్రైనింగ్ ఏంటి అక్కయ్య..తను అన్నదాంట్లో తప్పేముంది..వాళ్లు కాస్త లేట్ గా వచ్చారు అంతే అంటుంది జగతి. అదే లేట్ ఎందుకు అయింది, ఇదంతా నువ్వు ఆడిస్తున్న నాటకమేనా అంటుంది దేవయాని..వసూకి మండిపోతుంది..మర్యాదగా మాట్లాడండి మేడమ్..నాటకాలు ఆడటం మా మేడమ్ కి చేతకాదు..నాటకాలు ఎవరు ఆడతారో అందిరికి తెలుసులేండి అని దేవయానిని ఉద్దేశించి అంటుంది. దేవయానికి సౌండ్ ఉండదు..

జగతి..వసూ నేను మాట్లాడుతున్నాను కదా..ఆగు అంటే..మన ఇంటి దగ్గరకు వచ్చి, మనల్ని అంటే..ఎందుకు ఆగాలి అంటుంది వసూ. ఆవిడ ఎందుకు వచ్చారో నాకు తెలుసు, మనల్ని రెచ్చకొడుతున్నారు అంటుంది జగతి. దేవయాని బానే అర్థం చేసుకున్నావే..నీకు మళ్లీ మళ్లీ చెప్తున్నాను..నువ్వు ఆ ఇంటి గడప తొక్కలేవు.ఎప్పుడైతే గడప దాటి వచ్చావో ఆరోజే నీకు ఆఖరి రోజు అయింది, అనవసరంగా ఆశలు పెంచుకోకు, రిషీ మనసు మార్చే ప్రయత్నాలు చేయకు, నేను అన్నీ గమనిస్తున్నాను అంటుంది. జగతి..అక్కయ్య 20 ఏళ్లు దాటిపోయినా..మీ ఆలోచన మారలేదు, మీ పద్దతి మారలేదు అంటుంది. బాగా మాట్లాడుతున్నావ్.. నువ్వు ఆలోచించి మాట్లాడతావు, నేను ఆవేశంగా మాట్లాడతాను అంటుంది ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది.

తరువాయిభాగంలో..వసూ, జగతి రెస్టారెంట్ లో ఉంటారు. కాలేజ్ అయ్యాక రిషీ నిన్ను కలవమన్నాడుగా , కలవకపోతే కోపం వస్తుందిగా అని జగతి అంటుంది. అవును మేడమ్ కావాలనే కలవలేదు అంటుంది. ఇంకోసీన్ లో ధరణి కంగారుగా..మహేంద్రతో అత్తయ్యగారు వసూ, జగతి అత్తయ్య ఈ టైంలో ఎక్కడ ఉంటారో తెలుసుకుని మరీ వెళ్లారు అని చెబుతుంది.ఆ మాట రిషీ విని ఈ టైంలో వసూ రెస్టారెంట్ లో ఉంటుంది కదా అని వెళ్తాడు. రెస్టారెంట్ కి దేవయాని వెళ్లి జగతి వాళ్లను చూసి..ఈరోజు నీ పని అయిపోయింది జగతి అంటుంది. రేపు ఎపిసోడ్ రచ్చ రచ్చే. దేవయాని జగతి వాళ్లను తిట్టేది..రిషీ చూడాలి సూపర్ ఉంటది. చూద్దాం ఏం జరుగుతుందో.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version