మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నాయకులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ.. ట్వీట్ చేసారు. ఒక కోటికి బదులు వెయ్యి కోట్లు అని ప్రస్తావించారు. దీనిపై కాంగ్రెస్ లీడర్లు స్పందిస్తూ.. కేటీఆర్ పై వంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మంత్రిగా పని చేసిన వ్యక్తికి లెక్కల్లో ఇంత వీకా..? అని సెటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి స్పందిస్తూ.. కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.
సైకో రామ్ కి కోటి అంటే వెయ్యి కోట్లు అని.. పింకీలకు వర్డ్ డాక్యుమెంట్ అంటే ప్రభుత్వ డాక్యుమెంట్ అని బీఆర్ఎస్ నేతలనుద్దేశించి సెటైర్ వేసారు. ఎద్దుల్లాగా పెరిగిర్రు.. కోడికి ఉన్న బుర్ర లేదని.. మళ్లీ ఆ కాగితాలను పెట్టి కౌంటర్లు అని మీకు మీరే ఫీల్ అవుతున్నారని చెబుతున్నారని చెబుతూ. చివరగా “సే నో టు డ్రగ్స్ కేటీఆర్” అంటూ సామ రామ్మోహన్ రెడ్డి రాసుకొచ్చారు.