గుప్పెండంతో మనసు ఎపిసోడ్ 265: వసూకి ప్రేమతో శాలువా కప్పిన రిషీ..పెళ్లి భరాత్ లో రెచ్చిపోయి చిందేసిన వసూ-రిషీ

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర, రిషీ, ఫణీంద్ర క్యాబిన్ లో కుర్చుని ఎడ్యూకల్చర్ ప్రోగ్రామ్ గురించి పేపర్ లో పడిన ఆర్టికల్స్ చూస్తూ ఉంటారు. పేపర్ లో రాసిన ఆర్టికల్స్ చదువుతాను అని మహేంద్ర అంటాడు. రిషీ, ఫణీంద్ర మన గొప్పతనం మనం చెప్పుకోవటం ఏం బాగుంటది అనుకుంటూ ఉంటారు. ఇంతలో వసూ ఇంకా ఇద్దరు మేడమ్స్ వస్తారు. రిషీకి కంగ్రాట్స్ చెప్పి, మీ పర్మిషన్ తో జగతి మేడమ్ ని సత్కరించాలని మా అభిప్రాయం సార్ అంటారు. రిషీ ఈ సన్మానాలు, సత్కారాలు అవసరమా అంటారు. ఫణీంద్ర మాత్రం రీషీ ఒకటీంగా అందరం విజయం సాధించాక అభినందించుకోవటంలో తప్పేముంది చెప్పు అంటాడు. ఆ మాటకు వసుధార కూడా ఒక పోలిక చెప్పి అభినందించుకుంటే ఆదో అనందం సార్ అంటుంది. ఇలా అందరూ కలిసి రిషీని కన్విన్స్ చేస్తారు. ఫణీంద్ర మహేంద్ర చెవిలో ఏదో చెప్పి పంపిస్తాడు. జగతిని క్యాబిన్ కు పిలిపిస్తారు. కట్ చేస్తే అందరూ జగతికి క్లాప్స్ కొడతారు. రిషీ, జగతి, వసూని పక్కన నిల్చోపెట్టి మహేంద్ర మీ ముగ్గురు కృషివల్లే ఈ షో ఇంత సక్స్ అయింది అంటాడు. మహేంద్ర రెండు షాలువాలే తెచ్చాడంట. పర్లేదు మహేంద్ర తీసివ్వు చూద్దాం అంటాడు ఫణీంద్ర. ఇంతలో జగతి చేయి రిషీకి తగులుతుంది. రిషీకి అది నచ్చుదు, వసుధారను పిలుస్తాడు..కానీ వసూకి వినిపించదు..ఇక వసూని గుంజుకొచ్చి పక్కన నిల్చోపెట్టుకుంటాడు. జగతి ఈ అమ్మకు నీ మనసులో చోటు లేదు, పక్కన నుల్చునే అర్హత కూడా లేదా అనుకుంటుంది. ఫణీంద్ర జగితిని శాలువా కప్పి సత్కరిస్తారు. వసూ వెళ్లి ఫొటో తీయబోతుంది. రిషీ ప్రతిదానికి ఏదో ఒకటి అంటాడు. అవసరమా ఈ ఫొటే సెషన్ అంటాడు. ఫణీంద్ర ఒక జ్ఞాపకంలా ఉంటుంది కదా అని తీయమంటాడు. రిషీకి కూడా శాలువా కప్పి సన్మానం చేస్తారు.. జగతి, రిషీ పక్కనే నుల్చుంటారు. వసూ దొరికిందే ఛాన్స్ అనుకుని జూమ్ చేసి రిషీ-జగతినే తీస్తుంది. మహేంద్ర ఇక మనసులో నువ్వు గురుదక్షిణ చెల్లించుకుంటావ్ అనుకుంటాడు. రిషీ ఆ శాలువా తీసి ఛైర్ లో విసిరేస్తాడు. అంటే ఫోటోలు తీయటం ఆపమని ఇండైరెక్ట్ గా చెప్పినట్లే.

రిషీ బయటకొచ్చి ఇందాక జరిగింది ఆలోచిస్తూ ఉంటాడు. షట్ లో ఇరుక్కుపోయిన పువ్వురేకుని కిందపడేస్తాడు. వసూ అప్పుడే వచ్చి అది తీస్తుంది. దాన్ని ఎందుకు తీస్తున్నావ్, దాన్ని నేను పారేశాను కదా అంటాడు. వసూ చేతిలో ఇందాక రిషీకి కప్పిన శాలువాను చూపించి దీన్ని కూడా పారేశారా అంటుంది. విసిరేశాను అంటాడు. కానీ వసూ మీరు విసిరికొట్టింది మహేంద్రసార్ ప్రేమను, అభిమానాన్ని అంటుంది. ఒక ప్రాణంలోనే వస్తువుకి ఇన్ని సెంటిమెంట్స్ ఆపాదించటం నీ తెలివితేటలా వసుధార అంటాడు. వసూ ఇక క్లాస్ పీకటం స్టాట్ చేస్తుంది. మీరు మీ కోపాన్ని, కాలేజ్ ని , పర్సనల్ జీవితాన్ని కలుపుతున్నారు అంటుంది. ఒక చక్కటి ఉదాహరణ చెప్తుంది. రిషీ కోపంతో వసుధార నువ్వు ప్రతిసారి ఎందుకు నా వ్యక్తిగత విషయాలు మాట్లాడుతావ్ అంటాడు. నేను నాకు అనిపించింది, నాకు కనిపించింది చెప్తున్నాను. మహేంద్రసార్, ఫణీంద్రసార్ ప్రేమగా కప్పినశాలువా ఇది..మీకు అవసరంలేదనుకుంటే మళ్లీ కంటికి కనపడనంత దూరంగా విసిరేయండి అంటూ రిషీ చేతిలో ఆ శాలువా పెట్టేసి వెళ్తుంది.

ఇంకోపక్క జగతి, మహేంద్ర కారుదగ్గర నిలబడి ఉంటారు. జగతి దిగాలుగా రిషీ క్యాబిన్ లో చేసింది తలుచుకుంటుంది. మహేంద్ర జగితి..సంతోషిస్తున్నావా, భాదపడుతున్నావా అని అడుగుతాడు. మంచి ప్రశ్న అడిగావ్ మహేంద్ర,..రషీ పక్కన నుల్చున్నానని రిషతో సన్మానం జరిగిందని సంతోష పడాలా, రిషీ నన్ను పట్టించుకోలేదని, కోపంగా చూశాడని బాధపడాలా అంటుంది. మహేంద్ర రిషీలో మార్పువస్తుందని ఆశిద్దాం..నువ్వు బాధపడుతుంటే చూడటం నాకు చాలా బాధగా ఉంటుంది జగతి అంటాడు. జగతి ఇవన్నీ జరిగేపనులు కావులే అన్నట్లు మాట్లాడుతుంది. రిషీకి దూరంగా వెళ్లలేను, రిషీ నాకు దగ్గరగా రాడు అంటూ దిగాలుగా మాట్లాడుతుంది. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగా రిషీ ఆ శాలువా తీసుకుని అటుగా వెళ్తాడు. అది వీళ్లిద్దరు చూస్తారు. మహేంద్ర చూశావా జగతి మళ్లీ తీసుకుని వెళ్తున్నాడు..నిన్ను కాదన్నవాడు..మళ్లీ నిన్ను వెతుక్కుంటూ వస్తాడు , కొంచెం ఓపికపట్టు అంటాడు. నేను దేనికి ఆశపడటం లేదు మహేంద్ర..రిషీ నాకు దగ్గర కాకపోయిన పర్వాలేదు..నీకు ఎక్కడ దూరం అవుతాడేమో అని భయంగా ఉంది మహేంద్ర అంటుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

తరువాయిభాగంలో రిషీ-వసూ ఎక్కడో రాత్రిపూట బయట నుల్చుంటారు. వసూ చలికి వణుకుతుంటే..రిషీ అదే శాలువను వసూకి కప్పుతాడు. విసేరిసిన శాలువాను మళ్లీ నాకు ఇస్తున్నారా సార్ అంటుంది. కానీ మనోడు మాత్రం రొమాంటిక్ గా మా డాడ్, పెద్దనాన్న ప్రేమతో ఇచ్చిన శాలువాను నేను మనస్పూర్తిగా నీకు ఇస్తున్నాను అంటాడు. కట్ చేస్తే ఇద్దరు కారులో వెళ్తుంటే..ఏదో పెళ్లి భరాత్ ఎదరువతుంది. వసుధార కారుదిగి మాస్ డ్యాన్స్ వేస్తుంది. కాసేపటికి రిషీకూడా వెళ్లి భలే డ్యాన్స్ చేస్తారు. పూర్తివివరాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version