సీఐ పై గువ్వల బాలరాజు ఫైర్.. నన్నే ఆపుతావా..!

-

పోలీస్ అధికారి పై ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు మధ్య పెద్దఎత్తున వాగ్వాదం జరిగినట్టు కనిపిస్తోంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ దశదినకర్మ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అయితే ముందుగానే కార్య స్థలానికి గువ్వల బాలరాజు చేరుకున్నారు. వీఐపీ పార్కింగ్ ను దాటి కార్య స్థలానికి కారులో వెళ్లేందుకు ఆయన యత్నించారు.

Guvvala balaraju fires on police

అయితే అక్కడే సీఐ క్యాడర్ లో ఉన్న ఓ పోలీస్ అధికారి బాలరాజు ను అడ్డుకున్నారు. దాంతో ఎవడురా నువ్వు.. నన్నే ఆపుతావా అంటూ గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దాంతో పోలీసులు ఆయనకు ఎదురు తిరిగారు. ఎమ్మెల్యే అయితే ఏంటి.. పోలీసులను రా అనే అధికారం ఎవరిచ్చారు అంటూ పోలీసులు నిలదీశారు. దాంతో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version