వాస్తు: భార్యాభర్తల మధ్య ఇబ్బందులని ఇలా తొలగించండి..!

-

వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయి. నెగటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అయితే ఈ రోజు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలు పండితులు చెప్పడం జరిగింది. వీటిని కనుక మీరు అనుసరిస్తే తప్పకుండా ఆనందంగా ఉండడానికి అవుతుంది. అలాగే ఇంట్లో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి.

 

చాలా మంది భార్యాభర్తల మధ్య చీటికీ మాటికీ గొడవలు కలగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఆ సమస్య నుంచి కనుక బయటపడాలంటే రాత్రి నిద్రపోయే ముందు పటిక ఒక గ్లాసు నీళ్లలో వేయండి. ఉదయాన్నే పటిక మొత్తం కరిగి పోతుంది. ఆ నీటిని తీసుకెళ్లి రావి చెట్టుకి వేస్తే ఇద్దరి మధ్య బంధం బాగుంటుంది. అలానే గొడవలు కూడా తగ్గుతాయి. ఈ విధంగా మీరు ఒక నెల పాటు అనుసరిస్తే మంచిది. దీంతో భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోతాయి.

అదే విధంగా చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎర్రటి గుడ్డని తీసుకుని దానిలో కొంచెం పటిక వేసి మీ గదిలో ఉంచితే సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో నష్టం కలిగే వాళ్ళు ఆఫీసులో ఇలా పెడితే కూడా మంచిది. ఈ విధంగా కనుక మీరు అనుసరించారు అంటే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి అలానే ఆనందంగా ఉండడానికి కూడా అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version