కేంద్ర మంత్రి అమిత్ షాతో సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ సమావేశమవ్వడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాకరేపుతోంది. షా ఎన్టీఆర్ ని ఎందుకు కలవాలనుకున్నాడనే దానిపై క్లారిటీ లేక చాలా మంది రాజకీయ నాయకులు జుట్టు పీక్కుంటున్నారు.
అయితే అమిత్ షా- జూనియర్ ఎన్టీఆర్ భేటీపై స్పందించారు బీజేపీ ఎంపీ జీవీఎల్. ఇద్దరి మధ్య రాజకీయ అంశాలు చర్చకు వచ్చి ఉంటాయని షాకింగ్ కామెంట్స్ చేశారు జీవిఎల్. ఏం చర్చించారో అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రమే తెలుసు అని తెలిపారు జీవీఎల్.
ఢిల్లీ లిక్కర్ స్కాంపై తెలంగాణ , ఏపీ ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి లబ్ధి చేకూరిందనే ప్రచారం జరుగుతోందన్నారు. గ్రేట్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ అంటే ఇదేనా? లేపాక్షి భూముల వ్యవహారం పెద్ద ల్యాండ్ స్కామ్ అని పేర్కొన్నారు జీవీఎల్ నరసింహారావు.