కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. భారత్ పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజాగా.. మాజీ ప్రధాని దేవెగౌడ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి రేవణ్ణకు ఈ మహమ్మారి బారిన పడ్డారు.
రేవణ్ణ ప్రస్తుతం హొలెనారసిపుర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన.. కరోనా పరీక్ష చేయించుకోగా.. రిపోర్టులో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయనని కలిసిన వారిని కరోనా పరీక్షలు చేయించుకోమని ఆయన సూచించారు.