జర్నలిస్టును కిడ్నాప్ చేశారు.. ఆడియో బయటపెట్టిన నారా లోకేశ్..!

-

జర్నలిస్టు శివప్రసాద్‌ను ఏపీ పోలీసులు కిడ్నాప్ చేశారంటూ టీడీపీ నేత నారా లోకేష్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉన్న శివప్రసాద్‌ను పోలీసులు కిడ్నాప్ చేశారని లోకేష్ తెలిపారు. ఏపీ ప్రభుత్వ పాలసీల మీద ప్రశ్నించిన ఆయనను పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కిడ్నాప్ చేశారన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఆడియోను కూడా లోకేష్ విడుదల చేశారు. సీఎం జగన్ పోలీసులను పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నారన్నారు. కాగా, అంతకుముందే నారా లోకేశ్ మరో సంచలన విషయన్ని లేవనెత్తారు. మద్యం ధరలపై తీవ్ర విమర్శలు చేసిన చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరు బండకాడపల్లికి చెందిన ఆటో డ్రైవర్ ఓం ప్రతాప్ ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న ఉందంతం ప్రకంపణలు రేపుతోంది. ఇది ఆత్మహత్య కాదని, దారుణ హత్య అని లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version