ఏపీ కూలీలకు శుభవార్త. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పౌరసరాఫరాల సంస్థలో పనిచేస్తున్న హమాలీలకు హ్యాండ్లింగ్ ఛార్జీలను జగన్ ప్రభుత్వం పెంచింది.
పిడిఎస్ లో భాగంగా ఎమ్మెలెస్ పాయింట్ల వద్ద సరుకును లోడింగ్, అన్లోడింగ్ చేస్తున్న హమాలీలకు ప్రస్తుతం క్వింటాకు రూ. 22 ఇస్తుండగా, వాటిని రూ. 25 కు పెంచింది. అటు రాష్ట్రంలో ధాన్యం కొలుగోలు కొనుగోలు కేంద్రాల ద్వారా 28.43 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు పౌరసరాఫరాల సంస్థ ఎండి వీరపాండియన్ తెలిపారు.