లోకేష్ ‘తొలి అడుగు’..సక్సెస్ అయినట్లేనా!

-

ఎట్టకేలకు రాజకీయాల్లో నారా లోకేష్ తొలి అడుగు వేశారని చెప్పవచ్చు. ఇంతకాలం లోకేష్ రాజకీయం వేరు..ఇకపై రాజకీయం వేరు. పాదయాత్రతో లోకేష్ తొలి అడుగు వేశారు. మరి ఈ తొలి అడుగు సక్సెస్ అయిందా? అనే అంశాన్ని ఒక్కసారి చూస్తే..పలు ఆంక్షలు మధ్య లోకేష్ కుప్పం నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి పాదయాత్రకు టి‌డి‌పి శ్రేణులు, నేతలు తరలివచ్చారు. పాదయాత్రని సక్సెస్ చేయడానికి తమవంతు సాయం చేశారు.

ఇక లోకేష్ పాదయాత్ర మొదలుకావడమే పెద్ద ఎత్తున టి‌డి‌పి శ్రేణులు వచ్చాయి. పాదయాత్ర నడుచుకుంటూ ముందుకెళుతూ…మధ్య మధ్యలో ప్రజలని పలకరిస్తూ లోకేష్ ముందుకు నడిచారు. అయితే తొలి రోజు కావడంతో ఎక్కువ శాతం టి‌డి‌పి శ్రేణులే పాదయాత్రలో కనిపించారు. అటు భారీ బహిరంగ సభ పెట్టారు..సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు వచ్చాయి. ఇక నాయకులు స్పీచ్‌లు అయ్యాక చివరిలో లోకేష్ మాట్లాడారు. తొలిసారి లోకేష్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అసలు లోకేష్ ఎలా మాట్లాడతారనే ఆతృతతో చూశారు.

అయితే అనుకున్న దానికంటే లోకేష్ బెటర్ గానే స్పీచ్ ఇచ్చారని చెప్పవచ్చు. ఇప్పటికే ఆయన మాట తీరు చాలా వరకు మారింది. దూకుడుగా మాట్లాడుతున్నారు. కుప్పం సభలో సైతం ప్రతి సమస్యని అడ్రెస్ చేస్తూ..వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నిరుద్యోగం, మహిళా, రైతు…ఇలా అందరి సమస్యలపై మాట్లాడారు. అలాగే మధ్య మధ్యలో పంచ్‌లు వేశారు.

మాట్లాడటం అంతా బాగానే ఉంది..అందరి లాగానే మధ్య మధ్యలో స్పీచ్ పేపర్‌ని చూసుకోవడం, అక్కడక్కడ తబడటం జరిగింది. కానీ ఓవరాల్ గా లోకేష్ పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చారని టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి. అసలు జగన్ స్క్రిప్ట్ పేపర్ పూర్తిగా చదువుతున్నా..మొత్తం తప్పులే చెబుతారని, లోకేష్ అలా కాకుండా ఎఫెక్టివ్ గా స్పీచ్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. మొత్తానికి లోకేష్ తొలి అడుగు సక్సెస్ అయిందని అంటున్నారు. మరి రానున్న రోజుల్లో పాదయాత్ర ఏ మేర ప్రజల్లోకి వెళుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version