ఆ ‘ఫ్యాన్స్’కు హ్యాండ్..’ఫ్యాన్’కు దెబ్బేనా!

-

రాజకీయాల్లో ఏ నాయకుడు కూడా పూర్తి స్థాయిలో సంతృప్తి చెందరనే చెప్పాలి..ఎప్పటికప్పుడు పై పదవుల కోసం నాయకులు పాకులాడుతూనే ఉంటారు..అలాగే పదవుల కోసం పార్టీలు మారడం చేస్తుంటారు…అదేవిధంగా పార్టీ అధినేతలని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక పార్టీ అధినేతలు కూడా నాయకులని సంతృప్తి పరిచేందుకు పదవులు ఇస్తుంటారు…కాకపోతే పార్టీలో ఉన్న అందరి నాయకులని సంతృప్తి పరచడం అంత సులువైన పని మాత్రం కాదు.

ఇప్పుడు ఏపీలో జగన్ పరిస్తితి కూడా అదే…సాధారణంగా అధికార పార్టీ అంటే అనేక మంది నేతలు పదవుల కోసం ఎదురుచూస్తారు…అయితే అందరికీ పదవులు ఇవ్వడం చాలా కష్టం..ఇక పదవులు దక్కని నేతలు అసంతృప్తిగా ఉండటం కూడా సహజమే. ఈ మూడేళ్లలో జగన అనేక మంది నేతలకు పదవులు ఇచ్చి సంతృప్తి పరిచారు…అయితే ఇంకా చాలామందికి పదవులు దక్కాల్సి ఉంది. ఇక పదవులు దక్కనివారు అసంతృప్తిగా ఉండటం సహజమే.ఇప్పుడు వైసీపీలో అలాంటి అసంతృప్తి నేతలు ఎక్కువగానే ఉన్నారు.

తాజాగా జగన్…రాజ్యసభ బెర్త్ లని ఫిల్ చేశారు…విజయసాయిరెడ్డి, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలకు రాజ్యసభ కేటాయించారు..అయితే ఈ రాజ్యసభ పదవిపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఎప్పటినుంచో పదవి కోసం చూస్తున్న కొంతమంది నేతలు ఈ సారైనా పదవి దక్కకపోతుందా అనే ఆశతో ఉన్నారు. కానీ ఈ సారి కూడా ఆశ..నిరాశే అయింది.

ముఖ్యంగా కిల్లి కృపారాణి, చలమలశెట్టి సునీల్, మర్రి రాజశేఖర్, శిద్ధా రాఘవరావు ఇలా కొంతమంది నేతలకు నిరాశ ఎదురైంది. ఇందులో సునీల్, శిద్ధా రాఘవరావు టీడీపీ నుంచి వచ్చారు..అది కూడా రాజ్యసభ పదవి దక్కుతుందనే ఆశతో వచ్చారు. కానీ అదే టీడీపీ నుంచి వచ్చిన బీదా మస్తాన్ రావుక పదవి దక్కింది…అలాగే తెలంగాణకు చెందిన కృష్ణయ్యకు పదవి దక్కింది. కానీ వీరికి పదవులు దక్కలేదు. ఇక మర్రి ఎప్పటినుంచి పదవి కోసం చూస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు…అయితే ఈ పదవులు దక్కని వారు బాగా అసంతృప్తితో ఉన్నట్లే కనిపిస్తున్నారు…మరి ఈ అసంతృప్తి వైసీపీకి ఏమన్నా నష్టం చేస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version