శరీరానికి వ్యాయామాలు చాలా అవసరం..ఇప్పుడున్న రోగాలను ఎదుర్కొవాలంటే బాడీకి కాస్త శ్రమ అవసరం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..అయితే ఒకప్పుడు ఏవైనా నేల మీద చేసేవారు..కానీ ఇప్పుడు మాత్రం గాల్లో సాహసాలు చేస్తున్నారు. ఇలానే ఎన్నో రికార్డులను అందుకున్నారు..కొందరు గిన్నీసులో కూడా చోటు సంపాదించుకున్నారు.తాజాగా ఓ వ్యక్తి చేసిన అధ్బుతమైన ఎక్సెర్సైజ్ అందరినీ ఔరా అనిపించింది.
గాల్లో వేలాడుతూ అతను చేసిన వ్యాయామాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అవి గిన్నిస్ రికార్డును అందుకున్నాయి.నిజంగా గ్రేట్ కదా..అతను ఏం చేశాడో ఒకసారి చుద్దాము..
ప్రస్తుత రికార్డు చైనాకు చెందిన హాంగ్ జాంగ్‌టౌ పేరిట 74 పుష్పాలు చేసిన రికార్డ్ ఉంది. కానీ ఓ వ్యక్తి హెలికాఫ్టర్‌కు వేలాడుతూ ఒక్క నిమిషంలో అత్యధికంగా ఫుల్ అప్ చేసి గిన్నిస్ రికార్డు సృష్టించాడు..ఆకాశంలో ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు వేలాడుతూ పుల్-అప్ లు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. నెదర్లాండ్స్‌లోని ఇద్దరు యూట్యూబర్ ప్రమాదకరమైన సాహసం చేశారు. ఫిట్‌నెస్ ఔత్సాహికులు స్టాన్‌బ్రౌనీ, ఆర్యన్ ఆల్బర్స్ బెల్జియంలోని హూవెనెన్ ఎయిర్‌ఫీల్డ్‌లో హెలికాఫ్టర్ నుండి వేలాడుతూ పుల్‌అప్ ఛాలెంజ్ చేశారు.
ఈ నేపథ్యంలోనే జులై 6న బెల్జియంలోని ఆంట్‌వెర్ప్ ఎయిర్‌ఫీల్డ్‌లో గిన్నిస్ రికార్డ్స్ అధికారుల సమక్ష్యంలో ఈ ఫీట్ సాధించారు. ఇందుకు స్టాన్ బ్రౌనీ, అర్జెన్ అల్బెర్స్ పోటీ పడగా.. బ్రౌనీ నిమిషంలో 25 పుల్‌అప్స్ చేసి రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు 23 పుల్‌అప్స్‌తో ఆర్మేనియాకు చెందిన రోమన్ సరద్యాన్ పేరిట ఉన్న రికార్డును ఇతడు బద్దలుకొట్టాడు..ఏది ఏమైనా ఇతను డేర్ కు మెచ్చుకోవాల్సిందే..అందుకు సంబందించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..మీరు ఒకసారి చూడండి..
https://youtu.be/HceWb7C2teU