బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పథకాల వేటలో దూసుకుపోతుంది. ఆదివారం రోజు ఆరంభంలోనే రెండు స్వర్ణాలు, మరో కాంస్యం సాధించి పథకాల సంఖ్యను పెంచుకుంది. ఆదివారం న్యూజిలాండ్ తో జరిగిన క్రీడల్లో భారత మహిళా హాకీ జట్టు అదరగొట్టింది. నేడు న్యూజిలాండ్ లో జరిగిన పోరులో 2-1 తో విజయం సాధించి 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. మ్యాచ్ కొద్ది సెకండ్లలో ముగుస్తుంది అనగా న్యూజిలాండ్ గోల్ చేసి 1-1 స్కోరుని సమం చేయడంతో పెనాల్టీ షూట్ అవుట్ అనివార్యమైంది.
ఈ పెనాల్టీ షూట్ అవుట్ లో భారత్ తరపున సోనికా, నవనీత్ కౌర్ గోల్స్ సాధించగా.. న్యూజిలాండ్ తరపున మెగాన్ హల్ మాత్రమే గోల్ చేయగలిగింది. ఇక మహిళల బాక్సింగ్ 48 కేజీల మినిమం వెయిట్ విభాగంలో నీతూ గంగాస్, పురుషుల బాక్సింగ్ 51 కేజీల విభాగంలో అమిత్ పొంగాల్ పసిడి సాధించగా.. మహిళల హాకీలో భారత్ కాంస్యం సాధించింది.దీంతో ఇప్పటివరకు కామన్వెల్త్ లో భారత్ కి మొత్తం 43 పతకాలు. 15 బంగారం, 11 వెండి, 17 కాంస్య పతకాలు దక్కాయి.