మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఈరోజు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 88 ఏళ్ల రోశయ్య అనారోగ్యానికి గురవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. కాగా వైద్యులు అప్పటికే ఆయన మరణించినట్టు నిర్ధారించారు. రోశయ్య మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల నాయకులు రోశయ్య మృతికి సంతాపం ప్రకటించారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్, కేసీఆర్, కేటీఆర్, నారా లోకేష్, చంద్రబాబు సహా పలువురు సంతాపం ప్రకటించారు. అంతేకాకుండా రోషయ్య కుమారుడు శివ కు రాహుల్ గాంధీ ఫోన్ చేసి మాట్లాడారు.
రోశయ్య మృతి పట్ల సంతాపం ప్రకటించి సానుభూతి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంత రావు రోశయ్య మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అనంతరం ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోశయ్యను ముఖ్యమంత్రి పదవి చేయకుండా హింసించారని అన్నారు. అందరూ రోశయ్యను ఉపయోగించుకున్నారని… తనకు ప్రశాంతంగా పనిచేయనివ్వలేదని బాధ రోశయ్యకు ఉండేదని చెప్పారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు. రోశయ్య నిజమైన కాంగ్రెస్ వాది రోశయ్య అని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని హనుమంతరావు వ్యాఖ్యానించారు.