మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి నేపథ్యంలోనే.. కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్య మంత్రి కొణి జేటి రోశయ్య అంత్యక్రియ లను ప్రభుత్వ అధికారిక లాంచనాలతో జరపాలని నిర్ణయించింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఈ మేరకు రంగారెడ్డి , హైదరాబాద్ జిల్లా కలెక్టర్ల కు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్.
కాగా… రేపు ఒంటి గంట కు మహా ప్రస్థానంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్య క్రియలు నిర్వహించనున్నారు. కాసేపట్లో ఆస్పత్రి నుంచి రోశయ్య పార్థివ దేహాన్ని ఆయన ఇంటికి తీసుకెళ్లనున్నారు. రేపు 11 గంటల తరువాత గాంధీ భవన్ కు రోశయ్య పార్థివ దేహన్ని తరలించనున్నారు. గాంధీ భవన్ లో అభిమానుల కడసారి చూపుకోసం ఆయన భౌతిక కాయాన్ని ఉంచుతారు. రేపు ఒంటి గంట కు మహా ప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు జరుగనున్నారు. రేపు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానం లో అంత్యక్రియలు జరుగనున్నాయి.