గీత గోవిందంలో బాగున్నాడు.. అర్జున్ రెడ్డి- లో కన్నా అని అన్నారు చిరు. నాకు అసూయ పుట్టించేలా నటించాడు విజయ్ దేవర కొండ అని చెప్పాడు అల్లు అర్జున్. ఏదేమయినప్పటికీ తెలంగాణ వాకిట నుంచి కొన్ని ప్రతిభా సుమాలు వెల్లివిరిశాయి. సినివారం ఫేం తరుణ్ భాస్కర్ రూపొందించిన పెళ్లి చూపులు, అంతకుమునుపు మరో యువ దర్శకుడు, అశ్వినీదత్ అల్లుడు నాగ్ అశ్విన్ రూపొందించిన ఎవడే సుబ్రహ్మణ్యం, వీటి అన్నింటి కన్నా ముందు శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఇవన్నీ కూడా ఆయన నట జీవితాన్ని బాగా ప్రభావితం చేశాయి.
కానీ అర్జున్ రెడ్డితో డైరెక్టర్ ఒక్కసారిగా ఆయన జీవితాన్నే మార్చేశాడు. స్టార్ హీరో మెటీరియల్ ఇతడు అన్నది ఆయన నిరూపణ\\ఆయన సినిమా చేసిన నిరూపణ కూడా ఇదే! ఇదే సినిమా బాలీవుడ్ లో చేసినా కూడా అంతటి ఇంపాక్ట్ రాలేదు. తమిళ్ లో చేసినా కూడా రాలేదు. ఇకపై ఏ భాషలో చేసినా అర్జున్ రెడ్డి అనే మానియాలో విజయ్ ఒక్కడే ఒన్ అండ్ ఒన్లీ స్టార్ అని అనిపించుకుంటాడు. రేపటి వేళ సీక్వెల్ తీసినా కూడా అందులో అల్లు అర్జున్ నటించినా కూడా విజయ్ ను డామినేట్ చేయడం కష్టం కూడా ! అసాధ్యం అని అనొచ్చు. తప్పేం లేదు. ఆయన చేసిన క్యారెక్టర్ లో ఎగ్రసివ్ నేచుర్ , ఆయన యాటిట్యూడ్ ఆ సినిమాతో ప్రూవ్ అయింది. ఆ సినిమాను రూపొందించిన సందీప్ రెడ్డి వంగా మరో సినిమా తీసినా ఈ సినిమా ప్రభావం నుంచి అంత వేగంగా బయటపడడం సాధ్యం కాని పని!
ఏదేమయినప్పటికీ…
యాటిట్యూడ్ ఒక్కటే ఓ సిన్మాకు
శక్తినీ విజయాన్నీ ఇస్తుందని నమ్మను
నువ్వు కూడా నమ్మకు..
ప్రేమా వాంఛా శృంగారం వ్యక్తీకరణ
వీటిలో ప్రిమిటెవ్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది
దానిని దాటుకుని నీ రాబోవు సిన్మాలు
ఉండాలనో ఉంటాయనో అనుకుంటాను నేను…
ఇవాళ (మే 9, సోమవారం ) యువ హీరో విజయ్ దేవరకొండ పుట్టిన్రోజు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ రాస్తున్న కథనం ఇది. తెలంగాణ వాకిట సినిమా రూపు ఇప్పుడిప్పుడే మారుతోంది. ఇప్పుడిప్పుడే మంచి ఫలితాలు అందుకుంటోంది. వాటికి కొనసాగింపుగా కొన్ని కొత్త ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. విజయ్ దేవర కొండ చిన్న సినిమాల నుంచి ముఖ్యంగా థియేటర్ ఆర్ట్ నుంచి ఎదిగివచ్చాడు. ఆయన ఎన్నో అవమానాలు దాటుకునే వచ్చాడు.
ఒడిదొడుకులు దాటుకునే వచ్చాడు. ఆయన కల ప్యాన్ ఇండియా స్టార్ కావాలి అని! త్వరలోనే లైగర్-తో ఆ మాట కూడా నిజంకానుంది. పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్-తో కలిసి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే నిర్మాణ సంబంధ పనులు అన్నీ పూర్తయ్యాయి.ఈ సినిమా తరువాత ఆయన అదే పూరి జగన్నాథ్ డైరెక్షన్లో జనగణమన అనే సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాలూ విజయ్-కే కాదు, పూరీ కెరియర్-కు కూడా ఎంతో ముఖ్యం. ఆల్ ద బెస్ట్ పూరీ.. ఆల్ ద బెస్ట్ విజయ్.. అండ్ హ్యాపీ బర్త్ డే విజయ్ బంగారుకొండ ఎగైన్ అండ్ ఎగైన్.
– రత్నకిశోర్ శంభుమహంతి