తల్లిదండ్రుల వల్లే తన చదువుకి దూరం అయిన అక్కినేని.. కారణం..?

-

దివంగత అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమా పరిశ్రమకు మూల స్తంభం లాంటి వారు అని చెప్పవచ్చు. ఇక ఈయన స్వర్గీయ నందమూరి తారకరామారావు కంటే ముందుగా ఇండస్ట్రీలోకి వచ్చి తానేంటో నిరూపించుకుని.. తెలుగు సినీ ఇండస్ట్రీ కీర్తిని ఎక్కడికో తీసుకెళ్లారు. ఇదిలా వుండగా అక్కినేని నాగేశ్వరరావు 10 సంవత్సరాల వయసులోనే థియేటర్ లో పని చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఎన్నో నాటకాలలో స్త్రీ వేషం కట్టి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక ఎంతలా గుర్తింపు తెచ్చుకున్నారు అంటే ఒక ప్రముఖ వ్యాపారవేత్త స్త్రీ వేషంలో ఉన్న అక్కినేని నాగేశ్వరరావు ని చూసి తన స్నేహితుడితో.. అమ్మాయి ఎవరో చాలా బాగుంది.. వాళ్ల తల్లిదండ్రులు ఎవరో చెప్పు పెళ్లి చేసుకుంటాను అని అన్నాడట. ఇక దాన్ని బట్టి చూస్తే అక్కినేని ఎంతలా తన పాత్రలో లీనమై పోయే వారో స్త్రీ వేషంలో మరెంత బాగా కనిపించే వారో మనకు అర్థం అవుతుంది.

దేశం గర్వించదగ్గ నటుడిగా అనతికాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగేశ్వరరావు తన విద్యాభ్యాసం లో మాత్రం పూర్తిగా వెనుకబడి పోయారు అని చెప్పవచ్చు. కేవలం మూడవ తరగతి వరకు మాత్రమే తన విద్యను ముగించాల్సి వచ్చింది. అంతేకాదు అలా చదువు అర్థాంతరంగా ఆగిపోవడానికి కూడా కారణం ఆయన తల్లిదండ్రులేనట.. అసలు విషయంలోకి వెళితే అక్కినేని నాగేశ్వరరావు 1923 సెప్టెంబర్ 20 న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా రామాపురంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.. ఇక వీరు తల్లిదండ్రులకు ఐదుగురు కొడుకులు జన్మించగా వారిలో ఐదవ వారు అక్కినేని..అతని తల్లిదండ్రులు అక్కినేని వెంకట్రత్నం మరియు అక్కినేని పున్నమ్మ. వ్యవసాయ కమ్యూనిటీకి చెందినవారు. అతని తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో అతని అధికారిక విద్య ప్రాథమిక పాఠశాల విద్యకే పరిమితమైంది.

ఆ వయసులోనే తల్లిదండ్రుల కష్టాలను అర్థం చేసుకున్న అక్కినేని నాగేశ్వరరావు తన 10 సంవత్సరాల వయస్సులో థియేటర్‌లో పనిచేయడం ప్రారంభించాడు. ఇక తన నటనతో, ప్రతిభతో ప్రేక్షక అభిమానం సొంతం చేసుకొని కొన్ని వేల ఆస్తులను తన వారసుల కోసం కూడబెట్టారు. ఇకపోతే ఉన్నట్టుండి ఆయన అనారోగ్య సమస్యతో మరణించిన విషయం మనకు తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version