వార్డెన్ వేధింపులు తాళలేక ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి ఎస్సీ హాస్టల్‌లో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. తమకు పురుగుల భోజనం పెడుతున్నారని, ఉదయం వండిన అన్నం వాసన వస్తుందని.. అది తినలేకపోతున్నామని ఇద్దరు విద్యార్థినులు వార్డెన్‌కు ఫిర్యాదు చేశారు.
దీంతో ఆ మహిళా వార్డెన్ ఆ విద్యార్థినులపై నోటికి వచ్చినట్టు తిడుతూ దుర్భాషలాడింది. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థినులు వారి వద్ద ఉన్న టాబ్లెట్‌లను అధిక మోతాదులో మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే వారిని సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించగా..ప్రథమ చికిత్స చేసిన వైద్యులు, మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.హాస్టల్ వార్డెన్ ర్యాగింగ్ రోజురోజుకు ఎక్కువ అవుతుందని, బయటకు చెప్పుకోలేక, ఎక్కడికి వెళ్లలేక ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.
వార్డెన్ ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఇద్దరు విద్యార్థినులు
సత్తెనపల్లి ఎస్సీ హాస్టల్‌లో పురుగుల భోజనం పెడుతున్నారని, ఉదయం వండిన అన్నం వాసన వస్తుంది తినలేమని ఇద్దరు విద్యార్థినులు వార్డెన్ తో చెప్పారు.
దీంతో వార్డెన్ ఆ విద్యార్థినులపై నోటికి వచ్చినట్టు… pic.twitter.com/FDfBIKLmRB
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2024