హర్భజన్: కెప్టెన్సీ నుండి రోహిత్ ని తొలగించడం షాక్..!

-

ఇంకో వారం రోజుల్లో ఐపీఎల్ షురూ కాబోతోంది. మార్చ్ 22న టోర్నీ మొదటి మ్యాచ్ ఎంఏ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగబోతోంది. మార్చి 24న గుజరాత్ టైటాన్స్ తో ముంబై ఇండియన్స్ పోటీ పడనుంది. ఈ సీజన్లో రోహిత్ శర్మ ఎలా ఆడతాడు ఐదు సార్లు చాంపియన్ అయిన జట్టు ని కొత్త నాయకుడు హార్థిక్ పాండ్యా ఎలా నడిపిస్తాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

దీనిపై హర్భజన్ స్పందించారు రోహిత్ శర్మ ఛాంపియన్ ప్లేయర్ అని గొప్ప లీడర్ అని అన్నారు ఒక్కసారిగా కెప్టెన్సీ నుండి తొలగించడం రోహిత్ ని దిగ్భ్రాంతి కి గురి చేసి ఉంటుందని అన్నారు. రోహిత్ శర్మ ఛాంపియన్ ప్లేయర్. గొప్ప లీడర్. ముంబై ని అతను ఐదు సార్లు విజేతగా నిలిపాడు. భారత జట్టుకి అద్భుత విజయాలని అందించాడు. ఒక్కసారిగా కెప్టెన్సీ నుండి తొలగించడం అతనికి దిగ్భ్రాంతి గురి చేసిందని అన్నారు భవిష్యత్తు కోసం ముంబై ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version