రేవంత్ రెడ్డి కాన్వాయ్ పై ట్రోల్స్..!

-

తెలంగాణలో వాహనాల నెంబర్ ప్లేట్లు ఇంకొకసారి మారిన విషయం మనకి తెలిసిందే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న టైంలో ఏపీ సిరీస్ ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఎస్ సిరీస్ ని అమలు చేశారు. దాదాపు 10 ఏళ్ళు పాటు టీఎస్ పేరుతోనే రిజిస్ట్రేషన్ జరిగింది తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీ నుండి టీజీగా మార్చాలని భావించినా కేసిఆర్ అధికారం చేపట్టాక టీఎస్ గా మార్చారు. ఈ పేరు మీద తెలంగాణ ప్రజలకే అసంతృప్తి ఉన్న సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు టీఎస్ పేరుని టీజీగా మారుస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

అయితే ముఖ్యమంత్రి వెహికల్స్ ని టీఎస్ పేరుతో ఉన్న నెంబర్ ప్లేట్లని సెక్యూరిటీ సిబ్బంది తొలగించి టీజీ పేరుతో వాటిని బిగించారు నెంబర్ ప్లేట్లలో ఉన్న ఆర్ఆర్ పై ఇప్పుడు అందరి దృష్టిపడింది. కెసిఆర్ తన లక్కీ నెంబర్ 6 వచ్చేలా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ నైన్ వచ్చేలా చూస్తున్నారు. వెహికల్ నెంబర్ తో పాటుగా కాన్వాయ్ నెంబర్ కూడా 9 ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. టీజీ 09 ఆర్ ఆర్ వచ్చేలా నెంబర్ ప్లేట్లను బిగించారు. ఆర్ ఆర్ అంటే రేవంత్ రెడ్డి ఆ అని అందరూ ప్రశ్నిస్తున్నారు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version