హిందూ సంప్రదాయంలో మళ్లీ పెళ్లి చేసుకున్న హార్దిక్ పాండ్యా.. ఫొటోలు వైరల్

-

ఇండియన్ స్టార్ క్రికెటర్, టీ-20 టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. సినీ నటి నటాషా స్టాంకోవిచ్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వాలెంటైన్స్ డే రోజున ఉదయ్​పుర్​లోని రాఫెల్స్​ హోటల్​లో మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అంతకుముందు క్రైస్తవ సంప్రదాయంలో ఒక్కటైన ఈ జంట.. ఆ తర్వాత హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయంలో జరిగిన వివాహ ఘట్టాలకు సంబంధించిన ఫొటోలను హార్దిక్ షేర్​ చేశాడు. ప్రస్తుతం సోషల్ ​మీడియాలో వైరల్​గా మారాయి.

ఉదయ సాగర్ లేక్​ నడుమ నిర్మించిన ఈ విలాసవంతమైన భవనంలో జరిగిన వేడుకలకు ఇరు కుటుంబాలతో పాటు పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ ఫొటోలు చూసిన అభిమానులు ఫుల్​ ఖుషీ అయ్యారు. జంట చూడ ముచ్చటగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

2020 జనవరి 1న నటాషా వేలికి ఉంగరం తొడిగి ప్రపోజ్‌ చేసిన హార్దిక్‌ పాండ్యా.. లాక్‌డౌన్‌లో సమయంలో అత్యంత సన్నిహితుల నడుమ ఆమెను పెళ్లాడాడు. వీరికి 2020 జులైలో కుమారుడు అగస్త్య జన్మించాడు. ఇక అప్పుడు వేడుకగా పెళ్లి చేసుకోలేకపోయామనే లోటు తీర్చేందుకు భార్యకు ఈ మేరకు వాలంటైన్స్‌ డే గిఫ్ట్‌ ఇచ్చాడు హార్దిక్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version