మరోసారి హాట్ టాపిక్ గా మారిన బండ్ల గణేష్ ట్వీట్..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూ వార్తల్లో నిలుస్తుంటారు. రాజకీయాలపై, నటులపై ఆయన చేసే కామెంట్స్ తరచూ వివాదాస్పదంగా మారుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా బండ్ల గణేష్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు మరొకసారి హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు ఆ స్టార్ డైరెక్టర్ కే కౌంటర్ అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.

బండ్ల గణేష్ తన తాజా ట్వీట్ ద్వారా..” మోసం చేయాలనుకునే వాడు మేధావిలా నటిస్తాడు.. వంచించాలనుకునేవాడు గురువులా నటిస్తాడు.. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ కూడా భక్తుడు గానే పొగరుగా ఉంటాడు.. అది మీకు నచ్చినా నచ్చకపోయినా” అంటూ ఫైర్ ఎమోజిని తన వ్యాఖ్యలకు జత చేశారు బండ్ల గణేష్.. ప్రస్తుతం ఈ ట్వీట్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ను ఉద్దేశించి పెట్టారా అంటూ కూడా నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు.

ఇకపోతే ఇటీవల భీమ్లా నాయక్ సినిమా ఈవెంట్ కి బండ్ల గణేష్ను పిలవలేదు. దీనికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు అందుకు సంబంధించిన ఒక ఆడియో కూడా లీక్ అయ్యింది.కాగా ఆ ఆడియో తనది కాదని బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఇప్పుడు ఈ ట్వీట్ తో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చినట్లు అయింది. మొత్తానికైతే త్రివిక్రమ్ ను దృష్టిలో పెట్టుకొని బండ్ల గణేష్ ఇలాంటి ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version