Hari Hara Veera Mallu : “హరిహర వీరమల్లు” అదిరిపోయే లుక్ రిలీజ్..యుద్ధ వీరుడిగా పవన్‌ చింపేశాడుగా !

-

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే… భీమ్లా నాయక్‌ హిట్‌ తో జోష్‌ మీదున్న పవన్‌..వరుసగా మరో రెండు సినిమాలను లైన్‌ లో పెట్టాడు. స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” అనే పీరియాడికల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.

ఇంతకు ముందు నటసింహం నందమూరిి బాలకృష్ణ తో గౌతమీపుత్ర శాతకర్ణి వంటి హిస్టారికల్ మూవీ రూపొందించిన క్రిష్ ఆ అనుభవంతో ఈ సారి కూడా హరిహర వీరమల్లు లో 17వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్యం నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ఇందులో మొగల్ పాలకులకు ముచ్చెమటలు పట్టించిన వీరుడు ” హరిహర వీరమల్లు” గా పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌ గా నటిస్తోంది. అయితే.. ఇవాళ శ్రీరామ నవమి నేపథ్యంలో.. ” హరిహర వీరమల్లు” మూవీ నుంచి పవన్‌ కళ్యాణ్‌ లుక్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్‌ లో పవన్‌ కళ్యాణ్‌ ఓ యుద్ధ వీరుడిగా కనిపిస్తున్నాడు. బాణాలు పట్టుకుని.. దండయాత్ర చేసే వాడిలా కనిపిస్తున్నాడు. ఇక ఈ పోస్టర్‌ చూసిన పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version