Ramarao On Duty : “రామారావు ఆన్‌ డ్యూటీ” రొమాంటిక్ సాంగ్ రిలీజ్

-

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా “రామారావు ఆన్ డ్యూటీ”. శరత్ మండవ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను s.l.v. సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా… దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనువిందు చేయనున్నారు. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. శ్రీరామ నవమి పండుగ నేపథ్యంలో… రామారావు ఆన్‌ డ్యూటీ సినిమా నుంచి అదిరిపోయే సాంగ్‌ విడుదల అయింది. బుల్‌ బుల్‌ తరంగ్‌ అంటూ సాగే పాట ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటను సిద్ధి శ్రీరామ్‌ పాడటం గమనార్హం. కాగా… ఈ సినిమా జూన్‌ 17 వ తేదీన అన్ని థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version