జిల్లాలు రద్దు చేస్తానంటున్న రేవంత్ రెడ్డికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు రద్దు చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్రం లోని మల్లయ్య సిద్దిపేట నియోజకవర్గ స్థాయి యువత సమావేశం జరిగింది ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు.
కాంగ్రెస్ మోసాలని ప్రజాక్షేత్రం లో ఎండగట్టాలని ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీయాలని అన్నారు. తెలంగాణ వద్దు అని తుపాకీ ఎగ్గుపెట్టిన రేవంత్ రెడ్డి సీఎం కావడం బాధాకరమని అన్నారు సిద్దిపేటకు సంబంధించిన 150 కోట్లు నిధులు రద్దుచేసి వెటర్నరీ కళాశాలని కొడంగల్ తరలించుకుని వెళ్లిన రేవంత్ రెడ్డికి తగిన స్వస్తి చెప్పాలని చెప్పారు మాజీ సీఎం కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చారని చెప్పారు.