సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పై హరీష్ రావు సెటైర్లు వేశారు. ఈ రోజు 36వ సారి ఢిల్లీ వెళ్తున్నాడు మన సీఎం. అయినా కూడా కేబినెట్ విస్తరణ కు ఆమోదం తెచ్చుకోవడం లేదు. పంపకాల్లో తేడాలు వచ్చాయని ఢిల్లీ నుండి పిలుపు వచ్చినట్లుంది. ఇక్కడ వసూలు చేసినదానికి.. అక్కడికి పంపిన దానికి తేడా ఉన్నట్లుంది అని పేర్కొన్నారు.
అలాగే ఎల్లుండి బిఆర్ఎస్ ముఖ్య నాయకులతో SLBC టన్నెల్ వద్దకు వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళేటప్పుడు పోలీసులతో అడ్డుకోకుండా, అరెస్ట్ చేయకుండా మేము రావడం లేదని అంటున్న మంత్రులు చూసుకోవాలి. ఇన్ని రోజులు అక్కడ ఎన్డీఆర్ఎఫ్ పనులకు ఆటంకం జరగకుండా ఉండేందుకే వెళ్ళలేదు అని తెలిపారు. అలాగే బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు.. బీసీలకు ఏం చేశాడు రేవంత్ రెడ్డి.. చేస్తే ముందు మీ mlc తీన్మార్ మల్లన్నకు, అంజన్ కుమార్ కు సమాధానం చెప్పు. చర్చకు కేసీఆర్ వస్తాడా.. హరీష్ వస్తాడా అని సవాల్ విసిరాడు రేవంత్ రెడ్డి. ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని మేము చెప్పాము. మళ్ళీ ఇప్పటి వరకు చర్చకు పిలవలేదు. రేవంత్ కి సవాల్ విసరడం, ఆ తరువాత తొక ముడ్చడం అలవాటు అని హరీష్ రావు పేర్కొన్నారు.