కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే: హరీష్ రావు

-

కాంగ్రెస్ బిజెపి రెండు పార్టీలు కూడా దొందుదొందే అని వాటికి ఓటమితో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆటో కార్మికులతో హరీష్ రావు టెలి కాన్ఫరెన్స్ ని నిర్వహించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆటో కార్మికుల జీవితాలని ఆగం చేసిందని చెప్పారు. ఆటో కార్మికులకు నెలకి 10000 జీవన భృతి ఇవ్వాలని అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు.

దీనికి తోడు 40 మంది ఆటో కార్మికులు చనిపోయిన కాంగ్రెస్ నాయకులు పరామర్శించలేదని ఫైర్ అయ్యారు. ఆరు లక్షల మంది ఆటో కార్మికులని కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి నడ్డివిరిచిందని చెప్పారు ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పారు వెంకట్రామిరెడ్డి ని గెలిపించి మెదక్ గులాబీ జెండా అడ్డా అని నిరూపించాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version