ఆధానీ బలపడాలంటే మోదీని గెలిపించాలి: మంత్రి హరీష్ రావు

-

తెలంగాణ మంత్రి హరీష్ రావు తాజాగా మోదీపై మరియు బీజేపీ పై విమర్శలు చేశాడు. హరీష్ రావు ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై అనవసర విమర్శలు ప్రధాని మోదీ చేస్తున్నారని మండిపడ్డారు. BRS పార్టీ ఎవరికి చెందింది కాదని… ఇది పూర్తిగా ప్రజల అభివృద్ధి కోసమే వెలసిన పార్టీ అన్నారు. మహారాష్ట్రలో కేసీఆర్ పెట్టిన బహిరంగసభకు భారీగా ప్రజలు తరలివచ్చారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కేసీఆర్. దేశంలో ఆదానీ మరింత బలమైన వ్యక్తిగా అవతరణ చెందాలంటే మోదీని గెలిపించాలన్నారు. కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మా తెలంగాణాలో ఎన్ని పార్టీలు వచ్చి ఎన్ని సభలు పెట్టినా చివరకు గెలిచేది.. BRS అని ధీమా వ్యక్తం చేశారు.

ఎవరైనా మా పార్టీని వదిలి వెళుతున్నారంటే అర్ధం.. వారిని మేము ముందుగానే వద్దనుకున్నట్లు అని గుర్తించాలంటూ హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version