తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపేస్తారు : హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు

-

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారతీయ జనతాపార్టీ లపై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం పై ప్రధాని నరేంద్ర మోడీ అక్కసు వెళ్లగక్కారు అని నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం పై ప్రధాని మోడీ కుట్రలు చేస్తున్నారని… తెలంగాణ అభివృద్ధిని చూసి ప్రధాని మోడీ ఓర్వ లేక పోతున్నాం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్లమెంటు తలుపులు మూసేసి బిల్లు పాస్ చేశానని మాట్లాడారు… అప్పుడేమో తల్లిని చంపి బిర్యాని బతికించారు వ్యాఖ్యానించారని గుర్తు చేశారు హరీష్ రావు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఏకం కాకపోతే… మళ్లీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏపీలో కల్పిస్తారని మంత్రి హరీష్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

వలస కార్మికుల వల్లే కరోనా వచ్చింది అని ప్రధాని మోడీ మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. కుంభమేళ పెడితే కరోనా కేసులు పెరగలేదా అని నిలదీశారు. ట్రంప్‌ సభలు, ఎలక్షన్ల ర్యాలీలు పెడితే.. కరోనా కేసులు పెరిగాయని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version