మంత్రి ఉత్తమ్ కు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్..!

-

కృష్ణా జలాల వాటా పై సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నది పచ్చి అబద్ధం అని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తేల్చేసారు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్న 34-66 శాతం ఒకే సంవత్సరానికి అని, క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం తెలంగాణ కు 71% నీటి కేటాయింపులు జరగాలని కేసిఆర్ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్ ను కోరిందని స్పష్టం చేయడం విమర్శలు చేస్తున్న వారి నోళ్ళు మూయించే సమాధానం.

నీటి వాటాలు తేల్చేంత వరకు 50-50 కేటాయించాలని 2015న తెలంగాణ ప్రభుత్వం కోరినట్లు కృష్ణా బోర్డు ముందు తేల్చడం వంటి అంశాలు దాచేస్తే దాగని సత్యాలు. ఆంధ్రప్రదేశ్ పున్వ్యవస్థీకరణ చట్టం 2014 లో సెక్షన్ 89 పెట్టి, రాష్ట్రాల బదులు.. ప్రాజెక్టుల ఆధారంగా నీటి పంపిణీ జరిగేలా చేసింది మరియు కృష్ణా, గోదావరి బోర్డు ను ఏర్పాటు చేసి తెలంగాణ కు అన్యాయం చేసింది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీనే అని హరీష్ రావు ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version