కాంగ్రెస్ పార్టీకి పాలన చేతకాక బీఆర్ఎస్ నేతలను కేసులతో వేధిస్తున్నారు అని నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కంచర్ల భూపాల్ రెడ్డి పై దాడిని ఖండిస్తున్న. ప్రస్తుతం గ్రామ సభలు ప్రహసనంలా మారినాయి. గతంలో పోలీసుల విజ్ఞప్తి మేరకే కేటీఆర్ టూర్ ను వాయిదా వేశాం. రెండోసారి మంత్రుల ఒత్తిడికి మేరకే కేటీఆర్ రైతుమహా ధర్నా కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు అని ఆరోపించారు.
అలాగే కాంగ్రెస్ నేతల ఆదేశాలతో మున్సిపల్ అధికారులు బీఆర్ఎస్ ఫ్లెక్సీ లను తొలగించారు. నల్లగొండలో బీఆర్ఎస్ ఫ్లెక్సీ లను, పార్టీని చూసి కాంగ్రెస్ నేతలు బయపడుతున్నారు. అయితే అధికారులు అందరూ నిష్పక్షపాతంగా వ్యవహరించండి. అధికార పార్టీ నేతల ఆదేశాలను అమలు చేస్తే మీరే ఇబ్బందులు పడతారు. alageమరోసారి దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇక ఏది ఏమైనా రైతు మహా ధర్నా ను విజయవంతం చేస్తాం అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.