హుజురాబాద్ నియోజకవర్గంలో ఇవాళ మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 30 తర్వాత కూడా తెలంగాణ సీఎం గా కేసీఆర్ ఉంటారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడి పల్లిలో మంత్రి హరీష్ రావు ఇవాళ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. హుజురాబాద్ లో బీజేపీ గెలవనే గెలవదని.. గెల్చనా ఈటల మంత్రి అయియ్యేది ఉందా.. .? అని ప్రశ్నించారు.
నియోజక వర్గ పనులు చేసేది ఉందా… ? అని ఈటల రాజేందర్ ను నిలదీశారు హరీష్ రావు. ఆస్తులను కాపాడు కోవడానికే.. బిజేపి పార్టీలోకి ఈటల రాజేందర్ వెళ్లాడని నిప్పులు చెరిగారు. హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీను గెలిస్తే తాను అధికారులతో వస్తానని.. ఇక్కడ నిలబడి మీకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేరుస్తానని హామీ ఇచ్చారు హరీష్ రావ్. ఏం ఇవ్వరంట కాని ఓటు వేయాలని ఈటల రాజేందర్ కోరుతున్నాడని ఫైర్ అయ్యారు. కూలబెడతా, కాలబెడతా, ఘోరీ కడతా తప్ప ఇంకా ఏమైనా మాట్లాడుతున్నడా ఆలోచించండి.. అంటూ ప్రజలకు కోరారు. కాగా హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నిక ఈ నెల 30 వ తేదీన జరుగనుంది.