కొత్తగా ఇళ్లు కట్టుకునే వారికి అదిరిపోయే శుభవార్త

-

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంటి పెద్ద కొడుకులా రూ 2016 ఆసరా పింఛన్ ఇచ్చి మీ గౌరవం పెంచారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు గారు స్పష్టం చేశారు. త్వరలోనే జగా ఉండి.. ఇళ్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు ఇస్తామని ప్రకటించారు హరీష్‌ రావు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు.

ఈ మేరకు ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడారు. సీఎం కేసిఆర్ గారు ఇంటి పెద్దకొడుకులా రూ.2016 పెన్షన్ ఇచ్చి మీ గౌరవం పెంచారని.. టీడీపీ హయాంలో కేవలం రూ.50 రూపాయలు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.200 పెన్షన్ ఇచ్చేదనీ, కానీ సీఎం కేసీఆర్ వచ్చాక రూ.2016 పింఛన్లు అందిస్తున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు చేయడం లేదని.. పేద ప్రజల సౌకర్యార్థం చాలా రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసిఆర్ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడం పనిగా కేంద్ర బీజేపీ పని పెట్టుకుందని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎక్కడ సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version