కేసీఆర్‌ లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు : హరీష్‌ రావు

-

సిద్దిపేట ప్రజల దశాబ్ద కల నెరవేరింది. సొంతూరికి రైలుపై వెళ్లాలన్న కల నిజమైంది. సిద్ధిపేటకు రైలొచ్చింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాకు పుష్ పుల్ రైలు రావడం గొప్ప వరం అన్నారు. నీళ్లు, నిధులు జిల్లా కలను నిజం చేసింది సీఎం కేసీఆరే అన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణను పట్టించుకోలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్దిపేటకు రైలు తెస్తామంటూ అబద్ధాలు చెప్పారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. 2006 రైల్వే లైన్ మంజూరు అయ్యిందని, 33 శాతం రాష్ట్ర వాటా చెల్లించాలని చెప్పారని తెలిపారు. కేసీఆర్ రైల్వేలైన్ ను స్వయంగా రూపకల్పన చేశారని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారారు గానీ రైల్వేలైన్ రాలేదన్నారు.

కొండపాకలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మంత్రి హరీష్ రావు మాట్లాడారు.తెలంగాణ రావడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల అదృష్టం అన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట, మెదక్, కరీంనగర్ పై ఆనాటి ప్రభుత్వాలు కక్ష గట్టాయన్నారు. బీజేపీ వాళ్లు రైలు తమ వల్లే వచ్చిందని చెబుతుండడం సిగ్గుచేటన్నారు. 33 శాతం వాటా కడితే కనీసం సీఎం కేసీఆర్ ఫోటో కూడా పెట్టలేదన్నారు. 2 వేల 508 ఎకరాల భూ సేకరణ కోసం రూ.310 కోట్లు తెలంగాణ ప్రభుత్వం చెల్లించిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.330 కోట్లు ఇచ్చామన్నారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. సిద్దిపేట రైల్వే లైన్ కోసం తామే కష్టపడ్డామని, డబ్బులు ఇచ్చింది కూడా తామే అన్నారు. ఈ విజయం తెలంగాణ ప్రజలదన్నారు. ఆనాడు తొమ్మిదేళ్లు కాంగ్రెస్ మోసం చేసిందని, ఈనాడు బీజేపీ అబద్ధాలు ఆడుతోందని ఆరోపించారు. కేసీఆర్ లేకపోతే సిద్దిపేటకు రైల్వేలైన్ లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version