ఓట్ల కోసం బీజేపీ నేతలు గడ్డి తింటారా : హరీష్ సంచలన కామెంట్స్

-

సోషల్ మీడియాలో బీజేపీ చేస్తున్న ప్రచారాలు పై మంత్రి హరీష్ రావు ఈరోజు సిద్దిపేటలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు గ్లోబల్ ప్రచారం కి హద్దు ఆపు లేకుండా పోయిందని, ప్రజా స్వామ్యనికి ఇది మంచిది కాదు అని అన్నారు. నిజ నిజాలు రాష్ట్ర ప్రజలు ముందు ఉంచుతున్నామన్న అయన దుబ్బాక లో ఎక్కడైనా టీ ఆర్ ఎస్ దిమ్మ కూలిందా ? అని ప్రశ్నించారు. 2018 లో కల్వకుర్తి లో జరిగిన విషయాన్ని ఇక్కడ జరిగినట్లు చూపిస్తున్నారని, దుబ్బాకలో అవినీతి జరిగినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ 3 కోట్లు విడుదల అయినట్లు నిరూపించగలరా ? అని ఆయన ప్రశ్నించారు. ఓట్ల కోసం బీజేపీ నేతలు గడ్డి తింటారా ? అని ప్రశ్నించిన ఆయన దుబ్బాక ప్రజలు నిజ నిజాలు గమనించాలని అన్నారు. బీడీ కార్మికులు పించన్ల విషయం లో 2000 రూపాయలు లో 1600 మోడీ ఇస్తున్నారని విష ప్రచారం చేస్తున్నారని, పింఛన్ల విషయం లో బండి సంజయ్ కి సవాల్ విసురుతున్నా, దుబ్బాక పాత బస్ స్టాండ్ దగ్గర ఆధారాలు తో రావాలని ఆయన అన్నారు. బండి సంజయ్ నిరూపిస్తే నేను మంత్రి పదవికి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, లేదంటే ఎంపీ పదవికి, అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసి ముక్కు నేలకి రాయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version