కన్న కొడుకు చీర కొనివ్వకపోయినా.. పెద్ద కొడుకు కేసీఆర్ బతుకమ్మ చీర ఇస్తున్నారు – హరీష్ రావు

-

కన్న కొడుకు చీర కొనివ్వకపోయినా.. పెద్ద కొడుకు కేసీఆర్ బతుకమ్మ చీర ఇస్తున్నారని తెలిపారు ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు. మనోహరాబాద్ లో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు..ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ఉచిత కరెంట్ కాదు.. ఉత్త కరెంట్ అని.. ఉచితాలు వద్దు అనే బిజెపికి బుద్ది చెప్పాలని ఆగ్రహించారు.

కేసీఆర్ ది గజ్వేల్ నియోజక వర్గం కావడం మీ అదృష్టమని.. పేదల సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రభుత్వం మాదని తెలిపారు. ఢిల్లీలో కూర్చున్న వారు కాళేశ్వరం మీద విమర్శలు చేస్తారని.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు పింఛన్ రు. 75 ఉండే. ఎవరైనా చనిపోతేనే తప్ప వారి స్థానంలో నాడు కొత్తవి ఇచ్చేవి కావని విమర్శలు చేశారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 200 చేసింది. కానీ ఒంటరి మహిళలకు, చేనేత, గౌడ పింఛన్లు ఇవ్వలేదని.. కానీ మేము మాత్రం ఏకంగా 10 ఇంతలు పెంచి, రు. 2016 చేసాము. పింఛన్ల డబ్బు పెరిగింది పింఛన్ల సంఖ్య పెరిగింది. ఇది మా ప్రభుత్వంలో జరిగిన మార్పు అన్నారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version