సింగరేణిని బీజేపీ ప్రభుత్వం అమ్మాలని చూస్తోంది.. కేంద్ర ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్

-

మంత్రి హరీష్ రావు మరోసారి కేంద్రం, బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణిని అమ్మాలని చూస్తోందని విమర్శించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 100 పడకల భవన నిర్మాణాన్ని పరిశీలించిన ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు బీజేపీపై విమర్శలు గుప్పించారు. విశాఖ ఉక్కును అమ్మారు. ఇప్పుడు సింగరేణి బొగ్గు బ్లాకులను అమ్మాాకానికి పెట్టింది కేంద్రం. 135 శాతం లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లోకి నెట్టి అమ్మే ప్రయత్నం చేస్తోంది. బొగ్గు బ్లాకులు కేటాయింపులో గుజరాత్ కో నీతి.. తెలంగాణకు ఓ నీతా..? అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో మాత్రం బ్లాకులును మాత్రం వేలం వేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి వెలుగులు నింపే తెలంగాణ సింగరేణికి బొగ్గు బ్లాక్ లు ఎందుకు కేటాయించరో చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటిని ప్రైవేటీకరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version