హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ మెప్పుకోసం అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులకు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
ఎవరైతే ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి సీఎం రేవంత్‌కు సహకరించారో త్వరలోనే వారంతా జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన హెచ్చరించారు. ఎందుకంటే హెచ్‌సీయూ భూములు అటవీ శాఖ పరిధిలోని వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారని ఆయన గుర్తుచేశారు. దీనికి తోడు అక్రమంగా రుణాలు తెచ్చారని అన్నారు. త్వరలోనే హెచ్‌సీయూ భూముల వెనుకున్న కుంభకోణం బయటపడుతుందని వెల్లడించారు.