తెలంగాణా ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు కొన్ని కొన్ని చర్యలతో ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటారు. ఆయన ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. తాజాగా లాక్ డౌన్ సమయంలో హరీష్ రావు తన నియోజకవర్గ కేంద్రం సిద్ధిపేట లో షాక్ ఇచ్చారు. నేరుగా ఆయన రోడ్డు మీదకు వెళ్ళిపోయారు. ఒక పక్క కరోనా వైరస్ సోకకుండా ఉండాలని ప్రజలకు సూచించినా సరే,
ప్రజలు మాత్రం రోడ్ల మీదకు వస్తున్నారు. వాహనదారులు పని లేకపోయినా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా మంత్రి హరీష్ రావు సిద్ధిపేట లో షాక్ ఇచ్చారు. సిద్ధిపేట లో ఆయన లాక్ డౌన్ ని పరిశీలించారు. సిద్ధిపేటలోని విక్టరీ టాకీస్ సర్కిల్ నుంచి వారి నివాసం వరకూ పలు వీధుల్లో తిరిగారు. రోడ్ల మీదకు వస్తున్న జనాలకు ఆయన స్వయంగా షాక్ ఇచ్చారు.
అనవసరంగా బయట తిరుగుతూ కనిపించిన వాహనా దారులతో మాట్లాడి ఎక్కడికి వెళ్తున్నారని తెలుసుకున్నారు, సరైన కారణం లేని వారి వాహనాలను సీజ్ చేయించారు. ఇక వలస కార్మికులకు ఆయన స్వయంగా నిత్యావసర సరుకులను పరిశీలించారు. కరోనా వైరస్ చాలా ప్రమాదకరమని… అనవసరంగా రోడ్ల మీదకు వస్తున్న వారిని రోడ్డు మీదకు రావొద్దని మంత్రి సూచించారు. అనవసరంగా ఇబ్బందులు తెచ్చుకోవద్దని హెచ్చరించారు.